హీరో మోటోకార్ప్ తన ఈవీ స్కూటర్ విడాను అక్టోబర్ 7న మార్కెట్‌లో లాంచ్ చేయనుంది. విడా బ్రాండ్‌పై హీరో మోటోకార్ప్ సామాజిక మాంధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారాన్ని ప్రారంభించింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ వాహనాన్ని ఛార్జ్ చేసుకోండి అంటూ ప్రచారంలో పేర్కొంటోంది. విడా విద్యుత్ స్కూటర్ స్వాపబుల్ బ్యాటరీ టెక్నాలజీతో వస్తోంది. ఛార్జింగ్ పూర్తయిన బ్యాటరిని హీరో ఏర్పాటు చేసే బ్యాటరీ స్టేషన్స్‌లో ఇచ్చి, పూర్తి ఛార్జింగ్ బ్యాటరీని తీసుకునే వెసులుబాటును కంపెనీ కల్పిస్తోంది. దీన్నే స్వాపబుల్ బ్యాటరీ టెక్నాలజీగా పరిగణిస్తున్నారు. ఈ స్కూటర్‌ను ఇంటి వద్ద కూడా ఛార్జింగ్ చేసుకునే సదుపాయం ఉంటుంది.
తైవాన్‌కు చెందిన గోగోరో అనే బ్యాటరీ స్వాపింగ్ ప్లాట్‌ఫాంతో హీరో మోటోకార్ప్ 2921 ఏప్రిల్‌లోనే వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కంపెనీ హీరో కంపెనీ విడాకు బ్యాటరీ స్వాపింగ్ సదుపాయాన్ని కల్పిస్తుంది. ప్రస్తుతం స్వాపబుల్ బ్యాటరీ టెక్నాలజీతో బౌన్స్ ఇన్ఫినిటీ సంస్థ ఇ1 పేరుతో స్కూటర్‌ను తీసుకు వచ్చింది. హీరో మోటో కార్ప్ తీసుకు వస్తున్న విడా పూర్తి సాంకేతిక వివరాలు, ధర వంటి అంశాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.