Tuesday, November 26, 2024

రష్యా నుంచి భారీగా చమురు దిగుమతులు

రష్యా నుంచి ఏప్రిల్‌, మే నెలలో చమురు దిగుమతులు 4.7 రేట్లు పెరిగాయి. రష్య తగ్గింపు రేట్లకు ముడి చమురును మన దేశానికి అమ్ముతోంది. దీని వల్ల ఈ రెండు నెలల్లో రోజు నాలుగు లక్షల బేరల్స్‌ చమురును దిగుమతి చేసుకున్నాం.
రష్యా దిగుమతులపై పశ్చిమ దేశాలు ఆంక్షలు, నిషేధం విధించినప్పటికీ మన దేశ కంపెనీలు భారీ ఎత్తున రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాయి. చైనా, భారత్‌ రెండు దేశాలు రష్యా నుంచి చమురు దిగుమతులను భారీగా పెంచాయని రష్యా సెంట్రల్‌ బ్యాంక్‌ వెల్లడించింది. మే నెలలో రష్యా నుంచి చైనా చమురు దిగుమతులు 55 శాతం పెరిగినట్లు సెంట్రల్‌ బ్యాంక్‌ తెలిపింది.

21 శాతం పెరిగిన దిగుమతులు..

జూన్‌ నెలలో మన దేశ చమురు దిగుమతులు 21 శాతం పెరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో వినియోగం పెరగడంతో దిగుమతులు పెరిగాయని వివరించింది. ఇదే సమయంలో రష్యా నుంచి దిగుమతలు కూడా పెరిగినట్లు తెలిపింది. దిగుమతులు 13.1 శాతం పెరిగాయి. గత సంవత్సరంతో పోల్చితే దిగుమతులు 3.37 బిలియన్‌ టన్నులకు చేరుకుంది. చమురు వినియోగం కరోనాకు ముందు నాటి స్థాయికి చేరుకుంటోందని ప్రభుత్వం వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement