Sunday, November 24, 2024

Ayodhya కు భారీగా పెట్టబడులు.. పెరిగిన ఎగుమతులు

అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ప్రధాని చేతుల మీదుగా ఈ నెల 22న దేవాలయం ప్రారంభం కానుంది. అమోధ్య ఆధ్యాత్మిక పరమైన పేరు ప్రతిష్టలతో పాటు, మరోవైపు ఆర్ధికంగానూ బలోపేతం అవుతోంది. అయోధ్యకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఆధ్యాత్మిక టూరిజం భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్న కంపెనీలు వివిధ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి.

2023 చివరిలో ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ సందర్భంగా అయోధ్యలో 49,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ పెట్టుబడులతో అయోధ్య ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోనుంది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో అయోధ్య నుంచి 254 కోట్ల మేర వివిధ రంగాల నుంచి ఎగుమతులు జరిగాయి. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో జరిగిన 110 కోట్ల ఎగుమతులతో పోల్చితే ఇది 131 శాతం అధికం.

అయోధ్యలో ఆర్ధిక కార్యకలాపాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయని, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఎగుమతులు 150 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ తెలిపింది. అమోధ్య నుంచి జరిగిన ఎగుమతుల సంతృప్తికరంగా ఉన్నాయని డివిజనల్‌ కమీషనర్‌ గౌరవ్‌ దయాల్‌ చెప్పారు. అయోధ్య ఆర్ధిక విజయం సజావుగా సాగుతుందని ఆయన చెప్పారు. గతంలో ఉన్న ఎగుమతి రికార్డులన్నీ అధిగమించి తొమ్మిది రంగాలు గుర్తించదగిన పురోగతిని సాధించాయని చెప్పారు. అయోధ్య నుంచి జరిగిన ఎగుమతుల్లో ప్రధానంగా బొగ్గు కీలకంగా ఉంది.

- Advertisement -

90.61 కోట్ల విలువైన బిటుమినస్‌ బొగ్గు, 3.81 కోట్ల రూపాయల విలువైన స్టీమ్‌ కోల్‌ ఎగుమతులు జరిగాయి. వీటితో పాటు విదిధ రకాల ఇతర బొగ్గు ఎగుమతులు 44 కోట్లుగా ఉన్నాయి. క్రాఫ్ట్‌ పేపర్‌, పేపర్‌ బోర్డుల ఎగుమతులు 44.56 కోట్లుగా ఉన్నాయి. పోస్టర్‌ పేపర్‌ ఎగుమతులు 1.7 కోట్లుగా ఉన్నాయి. ఆయుర్వేదిక్‌ మెడిసిన్స్‌ ఎగుమతులు 3.18 కోట్లు, పారాబాయిల్డ్‌ రైస్‌ ఎగుమతులు 2.76 కోట్లు, ఉడ్‌ పల్ప్‌ బోర్డుల ఎగుమతులు 3.12 కోట్లు, బేకరీ మెషినరీ ఎగుమతులు 3.24 కోట్లుగా ఉన్నాయి.

ఆయోధ్య విజయం ఆర్ధిక వైవిధ్యం, స్థిరమైన వృద్దికి దాని నిబద్దతను ప్రతిబింబిస్తుందని, ఈ ప్రాంతం ఆధ్యాత్మిక, ఆర్ధిక సహజీవనం సమ్మిళితంగా సమగ్ర అభివృద్ధికి ఒక ప్రమాణాన్ని ఏర్పాటు చేశాయని గౌరవ్‌ దయాళ్‌ చెప్పారు. ఆర్ధిక ప్రయాణం ఆర్ధికాభివృద్ధికి, సమగ్ర పురోగతికి ఒక మోడల్‌గా ఉంటుందన్నారు. ఆయోధ్య ఉత్తరప్రదేశ్‌లో మొదటి సోలార్‌ సిటీగా అవతరించనుందని ఆయన తెలిపారు. ఒక పక్క ఆధ్యాత్మికతత, సమగ్ర ఆర్ధికాభివృద్ధి ఆయోధ్య రూపును పూర్తిగా మార్చనుందన్నారు.

సోలార్‌లో అగ్రగామిగా…

ఉత్తర ప్రదేశ్‌ రెన్యూబుల్‌ ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌ (యూపీఎన్‌ఈడీఏ) అయోధ్యలో సోలార్‌ పవర్‌ను డెవలప్‌ చేసింది. ప్రస్తుతం అక్కడ సోలార్‌ పవర్‌ బోట్లు, సోలార్‌ స్ట్రీట్‌ లైట్లు, సోలార్‌ పార్క్‌లు, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులోనూ సోలార్‌ ఎనర్జీని వినియోగిస్తున్నారు. ప్రభుత్వ ఆఫీస్‌లను సోలార్‌ భవనాలుగా మార్చారు. గ్రీన్‌ ఎనర్జీ పట్ల ఉన్న నిబద్ధతను ఆయోధ్య ప్రస్పుటంగా ప్రదర్శిస్తోంది.
ఆయోధ్య సోలార్‌ సిటీ కార్యక్రమంలో భాగంగా 165 ఎకరాల విస్తీర్ణంలో 40 మెగావాట్‌ సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో ఇప్పటికే 10 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. 2024 మార్చి నాటికి ఈ ప్లాంట్‌
మొత్తం 40 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి రానుంది. ఉత్తరప్రదేశ్‌ సోలార్‌ ఎనర్జీ పాలసీ 2022లో ఆయోధ్య సోలార్‌ ఇన్నోవేషన్‌లో పయనీరగా గుర్తించారు. నోయిడాతో పాటు 17 మున్సిపల్‌ కార్పోరేషన్‌లలో ఆయోధ్య మోడల్‌ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సరయూ నదీ తీరం వెంట సోలార్‌ పార్కులు అభివృద్ధి చేస్తున్నారు. సోలార్‌ పవర్‌ను పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులో ఉపయోగిస్తున్నారు.

సోలార్‌ మొబైల్‌ పబ్లిక్‌ ఛార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆయోధ్యలో సోలార్‌ ఎనర్జీని డొమిస్టిక్‌, నివాస గృహాలకు కూడా విస్తరిస్తున్నారు. బైరవ్‌ సింగ్‌ గోశాలలో 50 కిలోవాట్‌ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. రెసిడెన్షియల్‌ ప్లాట్లకు ఇప్పటి వరకు 1073 కిలోవాట్‌ సోలార్‌ పవర్‌ను ఏర్పాటు చేశారు. బాబుజీ కళ్యాణ్‌సింగ్‌ ఉన్నతి యోజన కింద సోలార్‌ స్ట్రీట్‌ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు.

రామమందిరంతో యూపీకి 20-25వేల కోట్ల ఆదాయం : ఎస్‌బీఐ నివేదిక

అయోధ్యలో రామ మందిరం, టూరిజంతో ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వానికి సంవత్సరానికి 20,000-25,000 కోట్ల రూపాయల ఆదాయం పన్నుల రూపంలో వచ్చే అవకాశం ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వ తీర్థయాత్ర పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి డ్రైవ్‌ (పీఆర్‌ఏఎస్‌హెచ్‌ఏడీ-ప్రసాద)తో ఉత్తర ప్రదేశ్‌కు పన్నుల ఆదాయం 2.5 లక్షల కోట్లకు చేరుతుందని ఆదివారం నాడు విడుదల చేసిన ఈ నివేదికలో పేర్కొంది.

ఈ సంవత్సరం చివరి నాటికి ఆయోధ్యకు వచ్చేన టూరిస్టులు, యాత్రీకులు చేసే వ్యయం మొత్తం 4 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు నివేదిక తెలిపింది. ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం ఆయోధ్య టూరిజం, యాత్రీకుల కోసం భారీగా ప్రచారం చేస్తోందని తెలిపింది. ఇందు కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది. 2022లో దేశీయ టూరిస్టులు అయోధ్యలో 2.2 లక్షలు ఖర్చు చేశారు.

విదేశీ టూరిస్టులు 10,000 కోట్లు ఖర్చు చేశారని నివేదిక తెలిపింది. 2022లో అయోధ్యకు రికార్డు స్థాయిలో 2.21 కోట్లు మంది టూరిస్టులు వచ్చారు. అయోధ్యలో రామమందిర ప్రారంభంతో పాటు, చుట్టు ఉన్న అనేక టూరిస్టు ప్రాంతాలను కూడా ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అయోధ్యతో పాటు, చుట్టు ప్రక్కల ఉన్న టూరిస్టు ప్రాంతాలతో కలిసి ఒక టూరిస్టు మ్యాప్‌ ను రూపొందిస్తున్నట్లు తెలిపింది.

ఆధ్యాత్మిక టూరిజం అయోధ్యతో పెరిగే అవకాశం ఉందని, ఇందు కోసం మౌలిక సదుపాయాలను భారీగా పెంచుతున్నట్లు తెలిపింది. టూరిస్టులను ఆకర్షించేందుకు కనెక్టివిటీ పెంచారని, ఇతర సదుపాయలు పెరుగుతున్నాయని పేర్కొంది. 2028 ఆర్ధిక సంవత్సరం నాటికి భారత్‌ 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా ఎదిగితే, ఉత్తర ప్రదేశ్‌ 500 బిలియన్‌ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా ఎదుగుతుందని తెలిపింది. ఈ సమయానికి జీడీపీ వృద్ధిలో ఉత్తర ప్రదేశ్‌ రెండో స్థానంలోకి వస్తుందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ అంచనా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement