పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. గురువారం అంబేద్కర్ జయంతి, మహావీర్ జయంతి సందర్భంగా స్టాక్, బులియన్ మార్కెట్‌కు సెలవు ప్రకటించారు. క్రిత సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ అత్యధికంగా రూ.53వేలు క్రాస్ చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో బంగారం ధరలు రూ.55వేలు క్రాస్ చేశాయి. అనంతరం తగ్గుముఖం పట్టినా మళ్లిd పుంజుకుని రూ.53వేలు దాటాయి. గోల్డ్ ఫ్యూచర్స్ రూ.2వేలకుపైగా పెరిగింది. గత సెషన్‌లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.220పెరిగి రూ.53,098వద్ద, ఆగస్టు గోల్డ్ ఫ్యూచర్స్ రూ.168పెరిగి రూ.53,293వద్ద ముగిసింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.667 ఎగిసి రూ.69,457వద్ద, జులై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.681ఎగిసి రూ.70,143వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్‌టైమ్ గరిష్ఠం 2075డాలర్లుకు చేరింది. అనంతరం 1920డాలర్లకు దిగింది. తాజాగా మళ్లిd 1975 డాలర్లకు చేరుకుంది. గోల్డ్ ఫ్యూచర్స్ సెషన్‌లో 10.20డాలర్లు నష్టపోయి 1974.50డాలర్లు వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 26,010 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో 1984డాలర్లను క్రాస్ చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..