Friday, November 22, 2024

హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్‌ విలీనం.. మార్కెట్​కు డబుల్​ బూస్టింగ్​

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో సానుకూలత.. హెచ్డిఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు విలీన ప్రకటన వెలువడంతో.. ముంబై దలాల్‌ మార్కెట్‌కు బూస్టింగ్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కొనుగోలుదారుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. కొనుగోలు చేసేందుకు మదుపరులు ఆసక్తి చూపించారు. మార్కెట్‌లో ఈ బూమ్‌ కారణంగా.. బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.272.48 లక్షల కోట్లకు పెరిగింది. గత వారం రూ.267.88 లక్షల కోట్ల వద్ద ముగిసింది. సోమవారం ఇన్వెస్టర్ల సంపదలో రూ.4.6 లక్షల కోట్ల జంప్‌ కనిపించింది. ఫిబ్రవరి 24న మార్కెట్‌ ముగిసినప్పుడు బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.242.24 లక్షల కోట్లుగా ఉంది. ఆ తరువాత నెల రోజుల వ్యవధిలో ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.30లక్షల కోట్లకు పైగా చేరుకోవడం శుభపరిణామం. 13 ఏళ్లలో హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల చరిత్రలో ఇదే అతిపెద్ద పెరుగుదల. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ విలీనం వార్తల కారణంగా.. నిఫ్టీ బ్యాంకు 4 శాతం (1486 పాయింట్లు) లాభంతో.. 38,635 పాయింట్ల వద్ద ముగిసింది. ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇండెక్స్‌ 4.64 శాతం, ప్రైవేటు బ్యాంకు ఇండెక్స్‌ 3.92 శాతం లాభపడ్డాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement