హైదరాబాద్, ప్రభన్యూస్ : హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి తన 12 నెలల ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మొత్తం ప్రీమియం వసూళ్లలో 19 శాతం వృద్ధి సాధించి 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చికి రూ. 45,963 కోట్లను పొందింది. ఈ సందర్భంగా హెచ్డిఎఫ్సి లైఫ్ ఎండీ, సీఈఓ విభా పడాల్కర్ మాట్లాడుతూ…. హెచ్డిఎఫ్సి లైఫ్ తన 13వ మరియు 61వ నెల పర్సిస్టెన్సీకి సంబంధించి మరింత మెరగుదలను కనబరిచిందన్నారు.
అన్ని విధాలుగా నిలకడతో కూడిన పనితీరును కనబరచడాన్ని తాము కొనసాగిస్తున్నా మన్నారు. పరిశ్రమలో మూడు అగ్రగామి జీవిత బీమా సంస్థల్లో ఒకటిగా ఉన్నామన్నారు. మహమ్మారి కారణంగా కష్టకాలం ఉన్నప్పటికీ తమ 2ఏళ్ల సీఏజీఆర్ 17శాతంగా ఉంటూ, పరిశ్రమ వృద్ధి 9 శాతానికి దాదాపు 2రెట్లు-గా ఉందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..