Tuesday, November 19, 2024

HYD: కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ ని కొత్త ఇంజనీరింగ్ ప్లాట్‌ఫారమ్‌లోకి మారుస్తోన్న హెచ్‌డీఎఫ్‌సీ

హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, జూలై 13, 2024న తన సిస్టమ్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకుంటోంది. దేశవ్యాప్తంగా 9.3కోట్ల మంది వ్యక్తులు, వ్యాపారాల కోసం వినియోగదారుని అనుభవాన్ని పెంపొందించే లక్ష్యంతో బ్యాంక్ తన కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ (CBS)ని కొత్త ఇంజనీరింగ్ ప్లాట్‌ఫారమ్‌లోకి మారుస్తోంది. ఈ మార్పు బ్యాంక్ పనితీరు వేగాన్ని మెరుగు పరిచేందుకు, అధిక ట్రాఫిక్ పరిమాణాన్ని నిర్వహించుకుంటూ, తన సామర్థ్యాన్ని విస్తరించుందకు, విశ్వసనీయత, పరిమాణాన్ని పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ అప్‌గ్రేడ్‌తో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌ను న్యూ-జెన్ ప్లాట్‌ఫారమ్‌లో హోస్ట్ చేసేందుకు దేశంలోని దాని పరిమాణంలో, బ్యాంకింగ్ వాల్యూమ్‌లో అతిపెద్ద బ్యాంకులలో ఒకటిగా నిలుస్తుంది.

షెడ్యూల్ అయినఅప్‌గ్రేడ్ వివరాలు:  
ప్రారంభం:13 జూలై2024, శనివారం ఉదయం 3.00గంటలకు
ముగింపు:13 జూలై2024, శనివారం సాయంత్రం 4.30 ఈ 13.5(పదమూడున్నర) గంటల సమయంలో వినియోగదారులు ఈ దిగువ పేర్కొన్న సేవలను అందుకోగలరు.

అందుబాటులో ఉన్న సేవల వివరాలు  
వివరాలు నెట్ అండ్ మొబైల్ బ్యాంకింగ్ యూపీఐ: వినియోగదారుల తమ సేవలను వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే, ఇది 13 జూలై 2024 శనివారం ఉదయం 3:00 నుంచి ఉదయం 3:45 వరకు, ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు అందుబాటులో ఉండదు.
బిల్లు చెల్లింపులు: కొత్త బిల్లర్లను జోడించవచ్చు అలాగే, ఇప్పటికే ఉన్న బిల్లర్లను వీక్షించవచ్చు. డీమ్యాట్, కార్డ్‌లు.
రుణాలు: సేవలను మాత్రమే వీక్షించవచ్చు.
మ్యూచువల్ ఫండ్‌లు: రిడమ్షన్‌లు, స్విచ్, వీక్షణ అండ్ విచారణ సేవలు, వెల్త్‌ఫై రిపోర్టులు, రిస్క్ ప్రొఫైల్, క్రమబద్ధమైన విభాగాల నిర్వహణ.

- Advertisement -

పైన పేర్కొన్న కొన్ని సేవలు మినహా అన్ని నెట్‌బ్యాంకింగ్ అండ్ మొబైల్ బ్యాంకింగ్ సేవలు ఉదయం 3:00 నుంచి సాయంత్రం 4.30 వరకు అందుబాటులో ఉండవు. మరిన్ని వివరాల కోసం తరచుగా అడిగే ప్రశ్నల విభాగాన్ని చూడండి.
నగదు ఉపసంహరణ: డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్‌లు వినియోగదారులు తమ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డ్ (పరిమితం చేయబడిన మొత్తం వరకు) లేదా క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి ఏదైనా ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేయడం కొనసాగించవచ్చు– వివరాలకు దిగువ ఉన్న ఎఫ్ఏక్యూల లింక్‌ని చూడండి. ఖాతా బ్యాలెన్స్ డిస్‌ప్లే శుక్రవారం, 12 జూలై 2024 రాత్రి 7:30 నాటికి అందుబాటులోకి వస్తుంది.


షాపింగ్ అండ్ పే: డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లు, యూపీఐ.
స్టోర్‌లలో: కస్టమర్‌లు స్వైప్ మెషీన్‌లలో వారి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డ్ (పరిమితం చేయబడిన మొత్తం వరకు) లేదా క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించవచ్చు. 
ఆన్‌లైన్: వినియోగదారులు తమ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డ్ (పరిమితం చేయబడిన మొత్తం వరకు) అండ్ క్రెడిట్ కార్డ్‌తో అంతరాయం లేని ఆన్‌లైన్ కొనుగోళ్లను చేయవచ్చు.


యూపీఐ: వినియోగదారులు ఈ సేవను వినియోగించుకోవచ్చు. అయితే, ఇది 13 జూలై 2024 శనివారం ఉదయం 3:00 నుండి 3:45 వరకు, ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు అందుబాటులో ఉండదు. నియంత్రిత పరిమితి ఏటీఎం నగదు ఉపసంహరణలు, స్టోర్‌లో లావాదేవీలు, ఆన్‌లైన్ లావాదేవీలు మరియు కాంటాక్ట్‌లెస్ లావాదేవీలకు కలిపి పరిమితిగా ఉంటుందని దయచేసి గమనించండి. కార్డ్ మేనేజ్‌మెంట్ వినియోగదారులు తమ కార్డ్‌ని హాట్‌లిస్ట్ చేయడం, వారి పిన్‌ని రీసెట్ చేయడం, ఇతర కార్డ్-సంబంధిత కార్యకలాపాలను కొనసాగించవచ్చు. మర్చెంట్ చెల్లింపులు వ్యాపారులు కార్డ్‌ల ద్వారా చెల్లింపులను స్వీకరించడం కొనసాగించవచ్చు. అయితే మునుపటి రోజు చెల్లింపుల కోసం ఖాతాకు అప్‌డేట్‌లు అప్‌గ్రేడ్ పూర్తయిన తర్వాత అందుబాటులో ఉంటాయి.  

Advertisement

తాజా వార్తలు

Advertisement