హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు ఊరట లభించింది. కొత్త క్రెడిట్ కార్డుల జారీకి విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. నిజానికి క్రెడిట్ కార్డుల జారీలో మిగతా బ్యాంకులతో పోలిస్తే హెచ్‌డీఎఫ్‌సీదే అగ్రస్థానం. నిషేధాన్ని ఎత్తివేయడంతో కొత్త కార్డుల జారీకి మార్గం సుగమం అయింది. అయితే, కొత్త టెక్నాలజీని తీసుకురావడంపై మాత్రం నిషేధం కొనసాగుతున్నట్టు ఆర్‌బీఐ వర్గాలు తెలిపాయి. గతేడాది డిసెంబరులో పలు మార్లు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో క్రెడిట్ కార్డుల విభాగంలో అగ్రగామిగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై కొత్త కార్డులు జారీ చేయకుండా ఆర్‌బీఐ నిషేధం విధించింది. ఇందువల్ల బ్యాంక్ ప్రస్తుత ఖాతాదారులపై మాత్రం ఎటువంటి ప్రభావం పడలేదు.
ఇది కూడా చదవండి: జగిత్యాలలో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం