Friday, November 22, 2024

మహమ్మారి కాలంలో 1000కు పైగా శాఖలను తెరిచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

హైదరాబాద్‌ (ప్రభ న్యూస్‌) : తమ ప్రాజెక్ట్‌ ఫ్యూచర్‌ రెడీలో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తాము తమ నెట్‌వర్క్ కు గత రెండు సంవత్సరాల కాలంలో 1000కు పైగా నూతన శాఖలను జోడించినట్లు- వెల్లడించింది. ఈ మహమ్మారి కాలంలో బ్యాంక్‌ ప్రతిరోజూ రెండు నూతన శాఖలను ప్రారంభించింది. ఒక్క 2022 ఆర్ధిక సంవత్సరంలోనే 734 శాఖలను ఇది తెరిచింది. ఈసందర్భంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రిటైల్‌ బ్రాంచ్‌ బ్యాంకింగ్‌ కంట్రీ హెడ్‌ అరవింద్‌ వోహ్రా మాట్లాడుతూ… రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ కళకు మరింత సైన్స్‌ జోడించడం ద్వారా ఈ ఛానెల్‌ను పునరావిష్కరించడం తమ శాఖల బ్యాంకింగ్‌ వ్యూహంలో భాగమన్నారు. తమ శాఖలు బ్యాంకును తమ వినియోగదారులు, సమాజం, ఇతర వాటాదారులకు చేరువ చేస్తాయన్నారు. అవి రిటైల్‌, బిజినెస్‌ కస్టమర్‌ సంబంధాలను కలిగి ఉంటాయన్నారు. తాము తమ శాఖలను ఫిజిటల్‌ మౌలిక వసతుల ఎస్సెట్స్‌గా మారుస్తున్నామని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement