ప్రపంచ కుబేరుడిగా ఎదిగిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇటీవలే ప్రథమ స్థానాన్ని కోల్పోయారు. 2022లో ఆయన మరో ఘనత సాధించారు. ప్రపంచలోనే అత్యంత వేగంగా 200 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయారు. చరిత్రలో సంవత్సర కాలంలో అత్యంత ఎక్కువ సంపద కోల్పోయిన వ్యక్తిగా ఎలాన్ మస్క్ డిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కారు. ఈ విషయాన్ని గిన్నిస్ బుక్
వెల్లడించింది. అతి తక్కువ కాలంలోనే ప్రపంచ నెంబర్ వన్ కుబేరుడిగా ఎదిగిన ఆయన అంతే వేగంగా సంపదను కోల్పోయారు. ట్విటర్‌ను కొనుగోలు చేసిన తరువాత చెల్లింపుల కోసం ఆయన టెస్లాలో తనకు ఉన్న షేర్లను భారీగా విక్రయించారు. ఈ క్రమంలోనే ఆయన ఎక్కువ సంపద కోల్పోయిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. ఫోర్బ్స్ నివేదక ప్రకారం 2021-22 ఒక్క ఏడాది వ్యవధిలో ఎలాన్ మస్క్‌కు చెందిన 182 బిలియన్ డాలర్ల సంపద అవిరైంది. మొత్తంగా చూస్తే ఆయన 200 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయారు. చరిత్రలో ఏ సంపన్నడూ ఈ స్థాయిలో నష్టాన్ని ఎదుర్కోలేదని గిన్నిస్ వరల్డ్ రికార్స్ పేర్కొంది.
320 నుంచి 138కి పతనం
ఫోర్బ్స్ అంచనా ప్రకారం 2021లో ఎలాన్ మస్క్ సంపద 320 బిలియన్ డాలర్లుగా ఉంది. 2023 జనవరి నాటికి ఆయన సంపద 138 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఖచ్చితంగా ఏ మేర ఆయన నష్టపోయారన్న దాన్ని సరిగా అంచనా వేయలేకపోయినప్పటికీ, మొత్తంగా ఆయన 182 బిలియన్ డాలర్ల వరకు సంపదను కోల్పోయినట్లు అంచనా వేస్తున్నారు. గత సంవత్పరం కూడా అత్యధిక సంపద నష్టపోయిన వారిలో ఎలాన్ మస్క్‌నే అగ్రస్థానంలో ఉన్నారు. గత సంవత్సరం ఆయన 58.6 బిలియన్ డాలర్ల నష్టంతో రికార్డ్ నెలకొల్పారు. ప్రస్తతం ఆయన తన రికార్డ్‌ను తానే అధిగమించారు. ఇలా భారీగా సంపదన కోల్పోవడంపై స్పందించిన మస్క్ దీర్థకాలపు సిద్ధాంతాలు బలంగా ఉంటాయని, స్వల్పకాలిక మార్కెట్లను మాత్రం ఊహించలేమని చెప్పారు.
ఎలాన్ మస్క్ ఆస్తులు ప్రధానంగా టెస్లా స్టాక్స్ రూపంలోనే ఉన్నాయి. ఇటీవల టెస్లా షేర్లు కూడా భారీగా పతనం అయ్యయి. 2022లో టెస్లా షేర్ల విలువ 65 శాతం క్షీణించింది. దీంతో పాటు ఆయన ట్విటర్ కొనుగోలు ఒప్పందాన్ని అమలు చేసేందుకు తన షేర్లను భారీగా విక్రయించారు. షేర్ల విలువ పతనం కావడంతో పాటు, ఎక్కువ షేర్లను విక్రయించడంతో ఆయన సంపద భారీగా తగ్గిపోయింది. విలువ తగ్గినప్పటికీ టెస్లానే ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా ఉంది. సంపద భారీగా తగ్గినప్పటికీ ఎలాన్ మస్క్ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ప్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ అర్నాల్డ్ 198 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు.