దేశంలో జీఎస్‌టీ వసూళ్లు 2023 డిసెంబర్‌లో తగ్గాయి. 2022 డిసెంబర్ వసూళ్లతో పోల్చితే 10.28 శాతం పెరిగాయి. 2023 డిసెంబర్‌లో జీఎస్‌టీ ఆదాయం మూడు నెలల కనిష్టాని తగ్గి 1.65 లక్షల కోట్లగా నమోదయ్యాయి. 2022 డిసెంబర్‌లో 1.50 లక్షల కోట్లు వసూలయ్యాయి. 2023 నవంబర్‌లో జీఎస్‌టీ వసూళ్లు 1.68 లక్షల కోట్లుగా ఉన్నాయి. అక్టోబర్‌లో అత్యధికంగా 1.72 లక్షల కోట్లు వసూలయ్యాయి. జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తరువాత ఇతే అత్యధికం.
గత సంవత్సరం దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన ఆదాయం కంటే ఈ సంవత్సరం 13 శాతం అధికంగా అదాయం సమకూరింది. డిసెంబర్‌లో సీజీఎస్‌టీ ఆదాయం 30,443 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ ఆదాయం 37,935 కోట్లు, ఐజీఎస్‌టీ 84,255 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఐజీఎస్‌టీలో 41,534 కోట్లు దిగుమతులపై ఆదాయం వచ్చింది. సెస్‌ల రూపంలో 12,249 కోట్ల వచ్చింది. ఇందులో దిగుమతులపై వచ్చిన సెస్ 1,079 కోట్లు ఉన్నాయి.
ఈ ఆర్ధిక సంవత్సరం 2023-24లో జీఎస్‌టీ వసూళ్లు వరసగా ఏడో సారి 1.60 లక్షల కోట్లకుపైగా వసూలయ్యాయి. 2023లో మొత్తం డిసెంబర్ వరకు 14.97 లక్షల కోట్ల రూపాయల జీఎస్‌టీ వసూళ్లు నమోదయ్యాయి. 2022 సంవత్సరం డిసెంబర్ వరకు వసూలైనదాని కంటే ఇది 12 శాతం అధికం. ఈ సంవత్సరం 9 నెలల కాలానికి నెలవారి సగటు జీఎస్‌టీ వసూళ్లు 1.66 లక్షల కోట్లుగా ఉన్నాయి. డిసెంబర్‌లో వసూలైన జీఎస్‌టీలో రాష్ట్రాలకు సీజీఎస్‌టీ నుంచి 40,057 కోట్లు, ఐజీఎస్‌టీ నుంచి 33,652 కోట్లు సెటిల్ చేసినట్లు ఆర్ధిక శాఖ తెలిపింది.