Friday, November 22, 2024

జీఎస్టీ వసూళ్లు 1.48 లక్షల కోట్లు..

జీఎస్టీ వసూళ్లు జులైలో రికార్డ్‌ స్థాయిలో 1,48,995 కోట్లు వసూలు అయ్యాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితో వసూళ్లు 28 శాతం పెరిగాయి. ఇంత భారీగా వసూలు కావడం ఇది రెండోసారి. జూన్‌ నెలలో గత సంవత్సరం కంటే 56 శాతం పెరిగి లక్షా 44 వేల కోట్లు వసూలు అయ్యాయని సోమవారం నాడు ఆర్థిక శాఖ విడుల చేసిన ప్రకటనలో తెలిపింది. జులైలో దిగుమతి చేసుకున్న వాటిపై 48 శాతం జీఎస్టీ ఆదాయం వచ్చింది. జులైలో సీజీఎస్టీ వసూళ్లు 25,751 కోట్లు, ఎస్‌జీఎస్టీ వసూళ్లు 32,807 కోట్లు, ఐజీఎస్టీ 79,518 కోట్లు వసూలైంది. సెస్‌ 10,920 కోట్లు వచ్చింది. లక్షా 40 వేల కోట్లకు పైగా జీఎస్టీ వసూలు కావడం ఇది ఐదో సారి. జూన్‌లో 7 లక్షల 45 వేల కోట్ల ఈ వే బిల్స్‌ జనరేట్‌ అయ్యాయని ఆర్థిక శాఖ ఆ ప్రకటనలో తెలిపింది. జులై 1, 2017లో జీఎస్టీ ప్రవేశపెట్టిన తరువాత ఈ అత్యధిక జీఎస్టీ వసూలు కావడం ఇది రెండో సారి.

తెలుగు రాష్ట్రాల్లో..

రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. గత సంవత్సరం జులై లో తెలంగాణలో 3610 కోట్లు వసూలైంది. ఈ సారి 26 శాతం వృద్ధితో 4,547 కోట్లు వసూలైనట్లు ఆ ప్రకటనలో తెలిపింది. ఏపీలోనూ జీఎస్టీ వసూళ్లలో 25 శాతం వృద్ధి నమోదైంది. ఈ జులైలో ఏపీలో 3,409 కోట్లు వసూలు కాగా, గత సంవత్సతరం జులైలో 2,730 కోట్లు వసూలైంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement