Tuesday, November 26, 2024

పిరమల్‌ నుంచి గృహ సేతు హోమ్‌లోన్‌.. తక్కువ వడ్డీ, తక్కువ ఈఎంఐ

పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌కు చెందిన అనుబంధ సంస్థ అయిన పిరమల్‌ క్యాపిటల్‌ ఎండ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (పీసీహెచ్‌ఎఫ్‌ఎల్‌), దేశంలోనే మొట్టమొదటి మోర్టేజ్‌ గ్యారెంటీ కంపెనీ అయిన ఇండియా మార్ట్‌గేజ్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌ (ఐఎంజీసీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా.. గృహ సేతు హోమ్‌ లోన్‌ – మార్ట్‌గేజ్‌ గ్యారెంటీతో తక్కువ వడ్డీకి గృహపరమైన రుణాలు అందించడం జరుగుతుంది. ఈ పరమైన సేవలు తక్కువ అందే ప్రాంతాలను ఎంపిక చేసి.. గృహ సేతు ద్వారా రుణాలు అందించేందుకు నిర్ణయించినట్టు పీసీహెచ్‌ఎఫ్‌ఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జైరాం శ్రీధరన్‌ తెలిపారు. కస్టమర్లు నేరుగా పీసీహెచ్‌ఎఫ్‌ఎల్‌కి రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, లేదా కనెక్టర్లు, డీఎస్‌ఏల వంటి ఛానెల్‌ భాగస్వాములను సంప్రదించినా రుణం పొందొచ్చని వివరించారు. దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి.. అవసరమైన రుణ పత్రాలు అందజేస్తే.. లోన్‌ అందించడం జరుగుతుందని ప్రకటించారు. లోన్‌ అర్హత ఎంపిక అనేది.. పీసీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఐఎంజీసీ ద్వారా పూర్తి చేస్తామన్నారు. దీర్ఘ కాలం పాటు.. తక్కువ ఈఎంఐలతో, సరసమైన వడ్డీ రేట్లతో కస్టమర్‌ అవసరాలకు సరిపోయేలా గృహ రుణం అందించడం జరుగుతుందని వివరించారు. పీసీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ద్వారా ఆస్తి ధృవీకరణ తరువాత.. రుణం మంజూరు ఉంటుందని స్పష్టం చేశారు.

డౌన్‌ పేమెంట్స్‌ తక్కువ..

ఐఎంజీసీ సీఈఓ మహేష్‌ మిశ్రా మాట్లాడుతూ.. పిరమల్‌ క్యాపిటల్‌ అండ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌తో ఒప్పందం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రియల్‌ ఎస్టేట్‌లో పిరమల్‌ డొమైన్‌ నైపుణ్యం, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇంటిని కొనుగోలు చేసేవారి ఎర్లీ హోమ్‌ ఓనర్‌షిప్‌ కలను నెరవేర్చడం జరుగుతుంద తెలిపారు. హామీతో కూడిన హోం లోన్‌ ఇస్తామని, తక్కువ డౌన్‌ పేమెంట్స్‌తో, ఎక్కువ రుణ కాల వ్యవధిని ఎంపిక చేసుకునే వెసులుబాటు కూడా ఉందని చెప్పుకొచ్చారు. పీసీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు ఐఎంజీసీ పూర్తి మద్దతు ఇస్తుందని, తక్కువ మార్కెట్‌లను సాధికారపర్చడంలో, దాని కార్యకలాపాలను వెయ్యికి పైగా నగరాలకు విస్తరింపజేశామని తెలిపారు. ఇండియా మార్ట్‌గేజ్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 1956లో చట్ట ప్రకారం విలీనం చేయబడిందన్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. రిటైల్‌ లెండింగ్‌లో.. పీసీహెచ్‌ఎఫ్‌ఎల్‌ భారత్‌ మార్కెట్‌లో 300కు పైగా బ్రాంచీలతో 24 రాష్ట్రాల్లో 1 మిలియన్‌ కస్టమర్లతో సేవలు అందిస్తున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement