దేశంలో 8 కీలక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలతో కూడిన కోర్ సెక్టర్ వృద్ధిరేటు సెప్టెంబర్ నెలలో 7.9 శాతంగా నమోదైంది. ఇది మూడు నెలల గరిష్టం. వీటిలో ప్రధానంగా ఎరువులు, సిమెంట్, విద్యుత్ రంగాలు డబుల్ డిజిట్ వృద్ధిని నమోదు చేశాయని సోమవారం నాడు పరిశ్రమ శాఖ విడుదల చేసిన అధికార లెక్కలు తెలుపుతున్నాయి. ఎనిమిది కీలక రంగాలైన బోగ్గు ఉత్పత్తిలో 12 శాతం, స్టీల్ 6.7 శాతం, విద్యుత్ రంగం 11 శాతం, సిమెంట్ ఉత్పత్తి 12.1 శాతం వృద్ధిని నమోదు చేశాయి. వీటితో పాటు రిఫైనరీ ఉత్పత్తులు 6.6 శాతం, ఎరువులు 11.8 శాతం నమోదు చేశాయి.
క్రూడ్ ఆయిల్ 2.3 శాతం, సహాజ వాయివు 1.7 శాతం మేర ఉత్పత్తి తగ్గింది. వరసగా నాలుగు నెలలుగా ఈ రంగాల్లో ఉత్పత్తి తగ్గుతూ వస్తోంది. ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో కోర్ సెక్టర్ 9.6 శాతం వృద్ధిని నమోదు చేశాయి. గత సంవత్సరం ఇదే కాలంలో ఇది 16.9 శాతంగా నమోదైంది. కోర్ సెక్టర్ మంచి వృద్ధిని నమోదు చేయడం పట్ల వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ హర్షం వ్యక్తం చేశారు.