365 రోజుల సమయంలో మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన గ్రాండ్ విటారా మిడ్‌రేంజ్ ఎస్‌యూవీ లక్ష యూనిట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించింది. కంపెనీ తీసుకు వచ్చిన ఎలక్ట్రిక్- హైబ్రీడ్ కారు గ్రాండ్ విటారా తక్కువ సమయంలోనే కస్టమర్ల ఆదరణ చూరగొన్నదని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆధునికతకు కొరుకునే కస్టమర్ల కోసం దీన్ని తీసుకు వచ్చినట్లు కంపెనీ తెలిపింది.
ఈ ఎలక్ట్రిక్ హైబ్రీడ్ కారు ఈ-సీవీటీ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. ఈ సెగ్మెంట్‌లో అత్యుత్తమ మైలేజీ 27.97 కిలోమీటర్లు ఇస్తుందని మారుతీ సుజుకీ తెలిపింది. ఈ కారులో 360 డిగ్రీల పార్కింగ్ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నట్లు తెలిపింది. గ్రాండ్ విటారా తక్కువ కాలంలో కీలకమైన మైలురాయిని అధిగమించడం పట్ల కంపెనీ మార్కెటింగ్ అండ్ సేల్స్ సీఈఓ శశాంక్ శ్రీవాస్తవా హర్షం వ్యక్తం చేశారు.