Sunday, November 24, 2024

Google | భారత్‌ కంపెనీలకు గూగుల్‌ వార్నింగ్‌

సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ భారత్‌లోని యూప్‌ డెవలపర్ల మధ్య ప్లే స్టోర్‌ ఛార్జీల వివాదం మరింత పెరిగింది. కొన్ని కంపెనీలు సర్వీస్‌ ఛార్జీలు చెల్లించకుండా తమ బిల్లింగ్‌ నిబంధనలు పదే పదే ఉల్లంఘిస్తున్నాయని శుక్రవారం నాడు పేర్కొంది. ఇలాంటి వాటిపై విధానపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అవసరమైతే తమ ప్లే స్టోర్‌ నుంచి వాటిని తొలగిస్తామని స్పష్టం చేసింది.

ఈ మేరకు తమ బ్లాగ్‌ పోస్ట్‌లో ప్రకటించింది. భారత్‌లో 2 లక్షలకు పైగా డెవలపర్లు గూగుల్‌ ప్లే స్టోర్‌ను వినియోగిస్తున్నారని, వీరంతా తమ పాలసీకి అనుగుణంగా వ్యవహరిస్తున్నారని తెలిపింది. 10 కంపెనీలు మాత్రం కొంత కాలంగా గూగుల్‌ ప్లేలో తాము అందిస్తున్న సర్వీస్‌లకు ఛార్జీలు చెల్లించడంలేదని, ఇందులో ప్రముఖ స్టార్టప్‌లు ఉన్నాయని తెలిపింది. కోర్టు నుంచి మధ్యంతర రక్షణ పొందుతూ ఈ కంపెనీలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని గూగుల్‌ తెలిపింది.

స్టానిక చట్టాలను తాము గౌరవిస్తామని, గూగుల్‌ ప్లేలో అందించే సేవలకు ఛార్జీలు వసూలు చేయడం తమ హక్కు అని, దాన్ని ఇన్నేళ్లలో ఏ కోర్టు, రెగ్యులేటర్‌ తిరస్కరించలేదని పేర్కొంది. ఇటీవల సుప్రీం కోర్టు కూడా ఇందులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించిందని తెలిపింది. 10 కంపెనీలు మాత్రం సర్వీస్‌ ఛార్జీలు చెల్లించడం లేదని తెలిపింది. మిగతా ప్లే స్టోర్లకు మాత్రం యథావిధిగా ఛార్జీలు చెల్లిస్తున్నాని, తమ పాలసీని ఉల్లంఘించే కంపెనీలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
గూగుల్‌ ప్లే కు పోటీగా ఇండస్‌ యాప్‌స్టోర్‌ను ఇటీవల ఫోన్‌పే ప్రారంభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement