Saturday, November 23, 2024

22 యాప్‌లను తొలగించిన గూగుల్‌

మాల్‌వేర్‌ దాడుల నుంచి యూజర్లకు రక్షణ కల్పించేందుకు డెవలపర్‌ పాలసీని పాటించని యూప్‌లను ప్లేస్టోర్‌ నుంచి గూగుల్‌ తొలగిస్తోంది. ఈ నిబంధనలు పాటించని 22 యూప్‌లను ప్లేస్టోర్‌ నుంచి గూగుల్‌ తొలగించింది. ఈ యాప్‌ల ద్వారా సైబర్‌ నేరగాళ్లు గూగుల్‌ ప్లేస్టోర్‌ నిబంధనలకు విరుద్ధంగా డేటా సేకరించడంతో పాటు, యూజర్‌ అనుమతి లేకుండానే డివైజ్‌ను యాక్సెస్‌ చేసి ప్రకటనలు స్క్రోల్‌ చేయడం వంటివి చేస్తున్నారని మెకాఫే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ తెలిపింది.దీని వల్ల యూజర్‌ ఫోన్‌ బ్యాటరీ ఛార్జింగ్‌ త్వరగా తగ్గిపోవడంతో పాటు మొబైల్‌ డేటా త్వరాగా అయిపోతుందని తెలిపింది.

గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి తొలగించిన వాటిలో లైవ్‌ టీవీ మ్యూజిక్‌ డౌన్‌డోల్‌, డిజిటల్‌ గిఫ్టింగ్‌, కొరియన్‌ లైవ్‌ టీవీ, ఆన్‌లైన్‌ లైవ్‌ టీవీ, మ్యూజిక్‌ రింగ్‌టోన్‌, సోషల్‌ మీడియా స్ట్రీమింగ్‌ కేటగిరి యూప్‌లు ఉన్నట్లు గూగుల్‌ తెలిపింది. ఇప్పటి వరకు ఈ యాప్‌లను 2.5 మిలియన్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. యూజర్లు తమ ఫోన్ల నుంచి వెంటనే ఈ యాప్‌లను తొలగించుకోవాలని గూగుల్‌ సూచించింది.

ప్లేస్టోర్‌ నుంచి తొలగించిన వాటిలో కంపోజ్‌ మ్యూజిక్‌ విత్‌ ఇనుస్ట్రుమెంట్స్‌, ట్రాట్‌ మ్యూజిక్‌ బాక్స్‌, ఏటీ ప్లేయర్‌, మ్యూజిక్‌ ప్లేయర్‌, ఆడియో ప్లేయర్‌, పబ్‌జీ మొబైల్‌ (కేఆర్‌) ఎమ్‌మ్యూజిక్‌, ఆన్‌ ఎయిర్‌, ఎయిర్‌లైన్‌ మేనేజర్‌, లైవ్‌ ప్లే, స్ట్రీమ్‌కర్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌, వాచ్‌ రియల్‌టైమ్‌ టీవీ డీఎంబీ, కామ్‌ ఆన్‌ ఎయిర్‌, ఆల్‌ ప్లేయర్‌, రింగ్‌టోన్‌ ఫ్రీ మ్యూజిక్‌, బారో, న్యూలైవ్‌, బారో టీవీ, బారో, మ్యూజిక్‌ డౌన్‌లోడర్‌, మ్యూజిక్‌ బడా, జిహోసాఫ్ట్‌ బొబైల్‌ రికవరీ యూప్‌, డీఎంబీ యూప్‌లు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement