Friday, November 22, 2024

Tamil Nadu లో గూగుల్‌ ఫోన్ల తయారీ ప్లాంట్‌..

గూగుల్‌ స్మార్ట్‌ ఫోన్ల తయారీ ప్లాంట్‌ను తమిళనాడులో ఏర్పాటు చేయనుంది. గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ ఇంక్‌ ఫిక్స్‌ల్‌ పేరుతో స్మార్ట్‌ ఫోన్లను తయారు చేస్తోంది. తైవాన్‌కు చెందిన కాంట్రాక్ట్‌ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌తో కలిసి కొత్త ప్రొడక్షన్‌ లైన్స్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్‌లో గూగుల్‌ ఫిక్సల్‌ ఫోన్లను అసెంబుల్‌ చేయనుంది.

గూగుల్‌కు చెందిన అనుబంధ సంస్థ వింగ్స్‌ ఇదే ప్లాంట్‌లో డ్రోన్లను అసెంబుల్‌ చేయనుంది. చైనా నుంచి తయారీ కార్యకలాపాలను యాపిల్‌ కంపెనీ త రలిస్తున్న విధంగానే గూగుల్‌ కూడా భారత్‌లో స్మార్ట్‌ ఫోన్ల తయారీని పెంచుకోవాలని నిర్ణయించింది. ఈ ప్లాంట్‌ ఏర్పాటుకు గూగుల్‌ భారీగా పెట్టుబడులు పెట్టనుంది.

రాష్ట్రంలో గూగుల్‌ ఫిక్సల్‌ ఫోన్ల తయారీ ప్లాంట్‌ ఏర్పాటుపై తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్‌బి. రాజా, సీనియర్‌ అధికారులు అమెరికాలో సంస్థ సీనియర్‌ అధికారులతో చర్చలు జరిపారు. భారత్‌లో ప్లాంట్‌ ఏర్పటు చేయనున్నట్లు గూగుల్‌ గత సంవత్సరంలోనే ప్రకటించింది.

శాంసంగ్‌ కూగా భారత్‌లో స్మార్ట్‌ ఫోన్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించింది. క్రమంగా గ్లోబల్‌ కంపెనీలు తయారీ ప్లాంట్లను భారత్‌లో పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఉత్పత్తి ఆధారత ప్రోత్సాహక పథకం కూడా పెద్ద కంపెనీలు భారత్‌ వచ్చేందుకు ఒక కారణమని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement