Sunday, September 8, 2024

Google Play Store | 17 స్పైలోన్‌ యాప్స్‌పై వేటు..

ప్లేస్టోర్‌ నుంచి 17 స్పైలోన్‌ యాప్స్‌ను గూగుల్‌ ఇటీవల తొలగించింది. యూజర్ల వ్యక్తిగత వివరాలపై నిఘా పెట్టాయనే సమాచారంతో వీటిపై వేటువేసినట్లు తెలిసింది. స్పైలోన్‌గా గుర్తించిన దాదాపు 18 యాప్‌లు గూగుల్‌ ప్లే స్టోర్‌లో దర్శనమిచ్చాయని ఈఎస్‌ఈటీ రిపోర్ట్‌ తెలిపింది. యూజర్ల డివైజ్‌ల నుంచి కీలక సమాచారాన్ని సేకరించి, నిఘా ఉంచేందుకు వీలుగా వీటిని డిజైన్‌ చేశారని సమాచారం.

ఈ డేటాను రుణ గ్రహితలను బ్లాక్‌మెయిల్‌ చేసి అధిక వడ్డీలు వసూలు చేసేందుకు వాడుకుంటున్నట్టు తేలింది. యూజర్లను బోల్తా కొట్టించే లోన్‌ యాప్‌ల వివరాలను ఈఎస్‌ఈటీ పరిశోధకులు షేర్‌ చేశారు. ఈ యాప్స్‌ ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, ఆగ్నేయాసియాలో నివసించే యూజర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడైంది. తమ నివేదికలో పేర్కొన్న 18 యాప్‌లలో 17 యాప్‌లను గూగుల్‌ తొలగించిందని సెక్యూరిటీ కంపెనీ ఈఎస్‌ఈటీ తెలిపింది. యాండ్రాయిడ్‌ యూజర్లు కూడా తమ ఫోన్ల నుంచి ఈ యాప్స్‌ను తొలగించాలని ఈఎస్‌ఈటీ కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement