Sunday, November 17, 2024

Google Wallet | భారత్‌లోకి గూగుల్‌ వాలెట్‌..

భారత్‌లో అండ్రాయిడ్‌ యూజర్ల కోసం గూగుల్‌ ప్రైవేట్‌ డిజిటల్‌ వాలెట్‌ను విడుదల చేసింది. ఇందులో లాయల్టి కార్డులు, మూవీ టికెట్లు, పాస్‌లు, ఐడీలు భద్రంగా స్టోర్‌ చేసుకోవచ్చు. ఇది గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. దీని మూలంగా గూగుల్‌ పే పై ఎలాంటి ప్రభావం ఉండదని, అది ప్రాథమిక చెల్లింపుల యాప్‌గా కొనసాగుతుందని గూగుల్‌ తెలిపింది. ప్రధానంగా లావాదేవీలు కాకుండా ఇతర అవసరాల కోసమే ఈ వాలెట్‌ను రూపొందించినట్లు తెలిపింది.

ఈ గూగుల్‌ వాలెట్‌లో ఫోన్‌లోనే మెట్రో కార్డులు, విమాన టికెట్లు, బస్‌ పాస్‌లు యాడ్‌ చేసుకోవచ్చు. గూగుల్‌ సెర్చ్‌ నుంచి అందిన సమాచారంతో ప్రయాణ సమయాల్లో మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. లాయల్టిd, గిఫ్ట్‌ కార్డులను గూగుల్‌ వాలెట్‌కు అనుసంధానం చేసుకోవచ్చు. ఫలితంగా వాటి గడువు ముగుసే లోపు ప్రయోజనాన్ని పొందేలా ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంది.

క్రికెట్‌ మ్యాచ్‌, సినిమా, ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్‌ను వాలెట్‌కు జత చేసుకోవచ్చు. దీని వల్ల సమయానికి వాలెట్‌ అప్రమత్తం చేస్తుంది. గూగుల్‌ వాలెట్‌లో భద్రపరిచే ప్రతి స మాచారం పూర్తి సురక్షితంగా ఉంటుందని సంస్థ తెలిపింది. టూ స్టెప్‌ వెరిఫికేషన్‌, ఫైండ్‌ మై ఫోన్‌, రిమాెెట్‌ డేటా ఎరేజ్‌, కార్డు నంబర్లను బహిర్గ తం చేయకుండా ఎన్‌క్రిప్టెడ్‌ పేమెంట్‌ కోడ్‌ వంటి గూగుల్‌ భద్రతా ఫీచర్లన్నీ వాలెట్‌కు వర్తిస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement