Saturday, November 23, 2024

మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. జీతాలు డబుల్ : సీఈఓ సత్య నాదెళ్ల..

న్యూఢిల్లి : టెక్‌ దిగ్గజ కంపెనీ.. మైక్రోసాఫ్ట్‌ తమ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. జీతాలు రెట్టింపు చేస్తామని ఆ సంస్థ అధినేత సత్య నాదెళ్ల మంగళవారం ప్రకటించారు. ఈ విషయాన్ని ఉద్యోగులందరికీ.. సత్య నాదెళ్ల స్వయంగా మెయిల్‌ ద్వారా వెల్లడించారు. ఈ నిర్ణయంతో.. సిబ్బందికి స్టాక్స్‌ రూపంలో ఇచ్చే సౌలభ్యాలు పెరగనున్నాయి. ఇటీవల కాలంలో సంస్థలో చేరినవారు.. కెరీర్‌ మధ్యలో ఉన్న వాళ్ల జీతాల్లో ఈ పెరుగుదల ప్రధానంగా కనిపించనుందన్నారు. సంస్థలోని చిన్న స్థాయి ఉద్యోగి నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగి వరకు ప్రతీ ఒక్కరు ఎంతో చక్కటి, అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారని సత్య నాదెళ్ల తెలిపారు. ఈ సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు చెప్పుకొచ్చారు. ఉద్యోగులు ఎంతో కష్టపడి పని చేస్తుండటంతోనే.. కంపెనీ లాభాలు పొందుతోందన్నారు.

తమ క్లయింట్స్‌కు మెరుగైన సేవలు అందించగల్గుతున్నామని అభిప్రాయపడ్డారు. సంస్థలో ఉద్యోగులు ఎంతో కీలకమని, ఉద్యోగులకు చాలా డిమాండ్‌ ఉందన్నారు. ఈ విషయంలో ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వివరించారు. ఉద్యోగులపై ఎంతో నమ్మకం ఉందని, అందుకే దీర్ఘకాలిక పెట్టుబడి పెడుతున్నట్టు వివరించారు. తాము గ్లోబల్‌ మెరిట్‌ బడ్జెట్ను కూడా రెట్టింపు చేస్తున్నామని తెలిపారు. ఈ పెంపు స్థానిక డేటా ఆధారంగా ఉంటుందని, ఒక్కో దేశంలో ఒక్కో విధానాన్ని అమలు చేస్తామని సత్య నాదెళ్ల తమ ఉద్యోగులకు ఈ-మెయిల్స్‌ ద్వారా తెలియజేశారు. అమెజాన్‌ ఫిబ్రరిలో కార్పొరేట్‌, టెక్‌ ఉద్యోగులకు గరిష్ట మూల వేతనాన్ని రెట్టింపు చేసింది. టాప్‌ టాలెంట్‌ను రిక్రూట్‌ చేసుకోవడానికి, ఉన్న ఉద్యోగులను కొనసాగించడానికి ఎక్కువ శాలరీని ఆఫర్‌ చేస్తున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement