హైదరాబాద్ మెట్రో రైల్‌లో జర్నీ చేసే వారికి మరో ఫేసిలిటీ అందుబాటులోకి వచ్చింది. దాదాపు స్మార్ట్‌ఫోన్ ఉన్న అందరూ వాట్సాప్ వాడతారు. ఇప్పుడు వేరే యాప్ అవసరం లేకుండా డైరెక్ట్ వాట్సాప్ ద్వారానే ఇక మెట్రో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇండియాలో వాట్సాప్ ద్వారా ఫుల్లీ డిజిటల్ పేమెంట్ ఎనేబుల్డ్ ఈ-టికెటింగ్ ఫెసిలిటీ తెచ్చిన తొలి మెట్రోగా హైదరాబాద్ మెట్రో రైల్ నిలిచింది. దీనికోసం ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ బిల్ఈజీతో హైదరాబాద్ మెట్రో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. దీంతో ప్రయాణికులు ఇప్పుడు వాట్సాప్ ద్వారానే హైదరాబాద్ మెట్రో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అదెలా అంటే..
ఫోన్‌లో వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి హైదరాబాద్ మెట్రో రైల్ నంబర్ కు +91 8341146468కు Hi అని మెసేజ్ చేయాలి. ఇందుకోసం ముందుగా ఈ నంబర్‌ను మీ కాంటాక్ట్స్ లిస్ట్‌లో సేవ్ చేసుకోండి. లేకపోతే మైట్రో స్టేషన్‌లలో ఏర్పాటు చేసిన QR కోడ్‌ను స్కాన్ చేసినా సరిపోతుంది.
ఆ నంబర్‌కు Hi అని మెసేజ్ చేసిన తర్వాత ఈ-టికెటింగ్ కోసం ఒక URL (లింక్) వాట్సాప్ చాట్‌లోనే వస్తుంది. (ఈ URL 5 నిమిషాల వరకు పని చేస్తుంది.)
ఆ URLపై క్లిక్ చేస్తే.. ఈ-టికెట్ గేట్‌వే వెబ్‌పేజ్ ఓపెన్ అవుతుంది.
ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో జర్నీరూట్‌ను ఆ వెబ్‌పేజ్‌లో ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత ప్రొసీడ్‌పై క్లిక్ చేస్తే.. పేమెంట్ పేజీకి వెళుతుంది. అక్కడ పేమెంట్ (GPay, PayTM, UPI, PhonePe, Debit Card) చేయాలి.
పేమెంట్ పూర్తయ్యాక ఈ-టికెట్ URL వాట్సాప్ చాట్‌కే వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే QRకోడ్ ఈ-టికెట్ డౌన్‌లోడ్ అవుతుంది.
ఇక మెట్రో గేట్ వద్ద ఈ QR కోడ్ స్కాన్ చేసి ఎంటర్ అవొచ్చు.