Saturday, November 23, 2024

Google Pay యూజ‌ర్స్‌కు గుడ్ న్యూస్.. దేశం వెలుపలా యూపీఐ చెల్లింపులు

గూగుల్‌కు చెందిన చెల్లింపు సేవల సంస్థ గూగుల్‌ పే నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన ఇంటర్నేషనల్‌ పేమెంట్స్‌ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకుంది. భారత్‌ బయట యూపీఐ సేవలన్ని అందించడంలో భాగంగా గూగుల్‌ పే ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇతర దేశాలకు వెళ్లే వారికి నగదు తీసుకెళ్లడం, ఇంటర్నేషనల్‌ గేట్‌వే ఛార్జీల భారం తగ్గనుంది.

ఇతర దేశాల్లోనూ సులువుగా యూపీఐ చెల్లింపులు జరపాలన్న ఉద్దేశంతో ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు గూగుల్‌ పే తెలిపింది. ఇందులో మూడు కీలక అంశాలు ఉన్నాయని పేర్కొంది. ఎలాంటి ఇబ్బందీ లేకుండా భారత్‌ వెలుపలా లావాదేవీలు నిర్వహించడం మొదటిది. ఇతర దేశాల్లో యూపీఐ వంటి డిజిటల్‌ చెల్లింపు వ్యవస్థను ఏర్పాటు చేయడం ఈ ఒప్పందం ఉద్దేశమని గూగుల్‌ తెలిపింది.

- Advertisement -

డిజిటల్‌ చెల్లింపులు ఒకపై విదేశీ కరెన్సీ, ఫారెక్స్‌ కార్డులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని, గూగుల్‌ పే ద్వారా భారత్‌ వెలుపలా యూపీఐ చెల్లింపులు చేయవచ్చని ఎన్‌పీసీఎల్‌ పేర్కొంది. ఈ అవగాహన ఒప్పందం యూపీఐ ఉనికిని బలోపేతం చేస్తుందని ఎన్‌పీసీఎల్‌ సీఈఓ రితేష్‌ శుక్లా చెప్పారు.

యూపీఐని ఉపయోగించి డిజిటల్‌ చెల్లింపులను విదేశాల నుంచి చేసేందుకు మన దేశం సులభతరం చేసింది. ఈ నేపథ్యంలోనే గూగుల్‌ ఈ ఒప్పందం చేసుకుంది. విదేశాల్లోని వ్యాపారులు ఇండియన్‌ కస్టమర్ల నుంచి నేరుగా చెల్లింపులు చేయవచ్చు.
2023 జులైలో ఫ్రాన్స్‌కు చెందిన లైరాతో ఎన్‌పీసీఐ ఒప్పందం చేసుకుంది. యూపీఐ, రూపే కార్డులు యూరోపియన్‌ దేశాల్లో ఆమోదించడం కోసం ఈ ఒప్పందం చేసుకుంది.

భూటాన్‌, నేపాల్‌, యూనైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, కెనడా యూపీఐ చెల్లింపు విధానాన్ని అంగీకరించాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తమ యాప్‌ల ద్వారా అంతర్జాతీయంగా యూపీఐ ద్వారా చెల్లింపులను నిర్వహిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement