ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. బంగారానికి ఉన్న డిమాండ్ మరేదేనికి కూడా లేదు. అయితే గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు…ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్ ధరల ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.260 తగ్గి 44,990కి చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.370 తగ్గి రూ.49,000కి చేరింది.
ఇక బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి ధర రూ.1100 మేర తగ్గి రూ.73,200కి చేరింది.