Sunday, November 17, 2024

BSNL | యూజ‌ర్ల‌కు గుడ్‌న్యూస్‌… అందుబాటులోకి 5G సిమ్‌కార్డులు..

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ 4G & 5G నెట్‌వర్క్‌లను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కాగా, తాజాగా ఈ కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్ 5G సిమ్ కార్డ్‌లను పరిచయం చేసింది. ప్రస్తుతం, ఈ 5G సిమ్ కార్డులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని యూజ‌ర్స్ బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయాలతో సహా ఇతర అధికారిక రిటైల్ అవుట్‌లెట్‌ల నుండి ఈ సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేయవచ్చు. రెగ్యూలర్‌ సైజ్‌తోపాటు మైక్రో, నానో సైజుల్లో ఈ సిమ్‌ కార్డులున్నాయి.

కాగా, ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌ 4G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆ సంస్థ ప్రయత్నం చేస్తోంది. అయితే టాటా సంస్థ భాగస్వామ్యంతో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (C-DOT) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా 4G – 5G సేవలకు సులభంగా అప్‌గ్రేడ్‌ అయ్యేందుకు అవకాశం ఉంది.

నచ్చిన మొబైల్ నంబర్లను ఎంచుకొవచ్చు…

బీఎస్ఎన్ఎల్ కంపెనీ త‌మ యూజ‌ర్ల‌కు న‌చ్చిన ఫోన్ నెంబ‌ర్లను ఎంచుకునే వెసులుబాటు క‌ల్పిస్తుంది. ఇందుకోసం.. “BSNL Choose Your Mobile Number” అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి “BSNL CYMN” అనే లింక్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత జోన్‌ల వారీగా ఎంపిక చేసుకోవాలి. అనంత‌రం search with series, Start Number, End Number, Sum of Numbers వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. ఆ ట్యాబ్‌ పక్కనే ఫ్యాన్సీ నంబర్‌ల కోసం మరో ఆప్షన్‌ ఉంటుంది. ఈ ఆప్షన్‌ల ద్వారా యూజ‌ర్లు త‌మ‌కు నచ్చిన నంబర్‌ను ఎంచుకోవ‌చ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement