Friday, November 22, 2024

బ్యాంక్‌ ఉద్యోగులకు త్వరలో గుడ్‌ న్యూస్‌..

బ్యాంక్‌ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త అందే అవకాశం ఉంది. వేతనాల పెంపుతో పాటు, వారానికి ఐదు రోజుల పని విధానంపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనిపై బ్యాంక్‌ యాజమాన్యాలతో కూడిన ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) చర్చిస్తోంది. ఉద్యోగులకు 15 శాతం వేతన పెంపునకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అంతకంటే ఎక్కువ వేతనం పెంచాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.

కొవిడ్‌ సమయంలోనూ ఆవిశ్రాంతంగా సేవలందించడం, ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అమలు చేయడంతో పాటు ఇటీవల కాలంలో బ్యాంక్‌ల లాభాలు పె రిగినందున ఆ మేర ఉద్యోగులకు మెరుగైన వేతన పెంపు కోసం ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. దీనిపై త్వరలోనే నిర్ణయం రావచ్చని భావిస్తున్నారు. ఐదు రోజుల పని విధానంపై ఇండియన్‌ బ్యాంకింగ్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది.

దీనికి ఆర్ధిక మంత్రిత్వ శాఖ, ఆర్‌బీఐ ఆమోదం తెలపాల్సి ఉంది. ప్రస్తుతం ఎల్‌ఐసీలో 5 రోజుల పని విధానం అమలవుతోంది.దీంతో బ్యాంక్‌లు, ఉద్యోగ సంఘాలు ఈ డిమాండ్‌ను తీసుకు వచ్చాయి. ప్రస్తుతం బ్యాంక్‌లు రెండో, నాలుగో శనివారాలు సెలవు దినంగా పాటిస్తున్నాయి. కొత్త విధానం అమల్లోకి వస్తే బ్యాంక్‌లు వారంలో ఐదు రోజులు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement