బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఝలక్. పసిడి రేటు పరుగులు పెడుతోంది. పైపైకి పెరుగుతూనే వెళ్తోంది. బంగారం ధర ఈరోజు కూడా పెరిగింది. కొద్దిగా లేటవుతుంది కాని పక్కాగా పెరుగుతా అన్నట్లు ఉంది బంగారం తీరు…కరోనా పుణ్యమా అని బంగారం రేట్లకు ఎప్పుడు రెక్కలు వస్తున్నాయో తెలియడం లేదు… కరోనా తగ్గుముఖం పట్టాకా మార్కెట్లు తిరిగి పుంజుకోవడంతో బంగారం కోనుగోలు చేసే వినియోగదారులు పెరిగారు. దీంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది…డిమాండ్ తో పాటు ధరలు పెరగడం మొదలుపెట్టాయి. తాజాగా ఈరోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 పెరిగి రూ. 45,150కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరిగి రూ. 49,260కి చేరింది. ఇక బంగారంతో పాటుగా వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో వెండి ధర రూ.600 పెరిగి రూ.74,500కి చేరింది. బంగారం బాటలోనే వెండి కూడా నడిచింది.
ఇది కూడా చదవండి: సీఎం పదవిపై ముగ్గురి కన్ను!