బంగారం ఇవాళ భారీగా తగ్గుముఖ పట్టాయి..హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గి రూ.45,000కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.3600 తగ్గి రూ.49,010కి చేరిది. దేశీయంగా మార్కెట్లు తిరిగి క్రమంగా పుంజుకోవడంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇక బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధర రూ.1,100 తగ్గి రూ. 73,200 వద్ద కొనసాగుతోంది. గత కొన్ని రోజుల క్రితం వరకు భారీగా పెరిగిన ధరలు ఇప్పుుడు తగ్గుముఖం పట్టడంతో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు వచ్చేది శ్రావణమాసం కావడంతో ఆషాడమాసంలో బంగారం కొనుగోలు చేస్తుంటారు..ఇదే సమయంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో రాబోయే రోజుల్లో మార్కెట్ రద్దీగా ఉండే అవకాశముంది.
ఇది కూడా చదవండి: నిరసన తెలిపే హక్కు ప్రజలకు లేదా?: పోలీసులపై నారా లోకేష్ ఫైర్