దేశంలో పుత్తడి ధరలు మళ్లీ దిగి వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పాటుగా, దేశీయంగా మార్కెట్లు జోరు పెరిగింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో అన్ని రంగాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. దీని ప్రభావం బంగారంపై పడింది. తాజాగా తగ్గిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 తగ్గి రూ.43,050 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 తగ్గి రూ.46,960కి చేరింది. బంగారంతో పాటుగా వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి ధర రూ. 1800 తగ్గి రూ.63,000 కి చేరింది.
ఇది కూడా చదవండి: బీజేపీలోకి తీన్మార్ మల్లన్న