గత కొన్ని రోజులుగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు ఇవ్వాళ కూడా అదే బాటలో పయణించాయి. తగ్గిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గి 44,200కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 మేర తగ్గి రూ.48,220 కి చేరింది. ఇక బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గింది. కిలో వెండి ధర రూ.200 తగ్గి రూ.68,000 కి చేరింది. నిన్నటి వరకు బంగారం ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు అమాంతంగా పెరిగాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు దిగి వస్తుండటంతో దేశీంగా ధరలు తగ్గుతున్నాయి. దీంతో మార్కెట్లో బంగారానికి భారీగా డిమాండ్ ఏర్పడింది.
ఇది కూడా చదవండి: RRRలో హైలెట్ సీన్.. మూడు వారాలు చిత్రీకరించిన యూనిట్