మొన్నటి వరకు రెక్కుల కట్టుకుని ఎగిరిన బంగార ధరలు ఇప్పుడిప్పుడే కాస్త దిగివస్తున్నాయి. మార్కెట్ పుంజుకోవడంతో ముదుపరులు బంగారంతో పాటుగా లాభసాటిగా ఉండే ఇతర రంగాలలో కూడా పెట్టుబడులు పెడుతుండటంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,110 వద్ద ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,110 వద్ద ఉన్నది. బంగారం ధరల్లో మార్పులు లేకున్నా, వెండి ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. కిలో వెండి రూ.200 తగ్గి రూ.73,300కి చేరింది. ఒకప్పుడు సామాన్య ప్రజలకు అందుబాటులో లేని బంగారం ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో దేశంలో బంగారం ధరలు దిగివస్తుండటంతో కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియాలో మళ్లీ మొదలైన లాక్ డౌన్..!