Friday, November 22, 2024

పసిడి పదనిసలు..

బంగారం ధరలు మరోసారి అంచనాలకు అందట్లేదు. ఎప్పుడు గోల్డ్ రేట్లు తగ్గుతాయో ఎప్పుడు పెరుగుతాయో ఎవరికి అంతు పట్టడం లేదు. ఓవైపు అంతర్జాతీయ నిపుణులు… బంగారం ధరలు పెరుగుతాయని అంచనా వేస్తుంటే బంగారం ధరలు తగ్గుతున్నాయి.. కరోనా ప్రపంచ దేశాల్లో పెరుగుతోంది…ఆ టెన్షన్ వల్ల స్టాక్ మార్కెట్లు డౌన్ అవుతాయనీ… ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటారని అంచనా వేశారు. అలా వెనక్కి తీసుకున్న డబ్బును బంగారంపై పెట్టుబడిగా పెడతారని అంచనా వేశారు. కానీ వాళ్ల అంచనాలు తప్పాయి. స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్ల జోష్ కనిపించింది. లాభాల్లోకి వెళ్లాయి. తాజాగా బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. అదే సమయంలో దేశంలో బంగారం రేట్లు ఒకేసారి పెరగడం కూడా ఇప్పుడు కొనుగోళు పడిపోవడానికి కారణంగా తెలుస్తోంది. రేట్లు విపరీతంగా పెరగడంతో తప్పనిసరి అయితే తప్పా బంగారాన్ని కొనడం లేదు వినియోగదారులు. దీంతో కొనుగోళ్లు పడిపోయాయి.

ఈ ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల్లో దేశంలోకి పసిడి దిగుమతుల విలువ 2611 కోట్ల డాలర్లకు పడిపోయింది. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 3.3 శాతం తక్కువ. దీంతో గత 11 నెలల్లో వాణిజ్య లోటు, అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 15,137 కోట్ల డాలర్ల నుంచి 8,462 కోట్ల డాలర్లకు పడిపోయింది. ఈ ఏడాది జనవరి వరకు అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఎక్కువగా ఉండడం దిగుమతులు తగ్గడానికి ప్రధానంగా దోహదం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement