బంగారం ధరల్లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. బుధవారం స్వల్పంగా తగ్గిన బంగారం.. గురువారం మళ్లీ పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 110 పెరగగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 100 పెరిగింది. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,040గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,700 వద్ద కొనసాగుతోంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర నేడు కిలోకు రూ.200 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ కిలో వెండి ధర రూ.68,000గా ఉంది.హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,700 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,040గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,700 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,040గా ఉంది. విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతోన్నాయి.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 62,100 ఉండగా, ముంబైలో రూ.62,100గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.68,000 ఉండగా, కోల్‌కతాలో రూ.62,100గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.68,000 ఉండగా, కేరళలో రూ.68,000గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.68,000 ఉండగా, విజయవాడలో రూ.68,000 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. అయితే ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.