దేశంలో బంగారం ధరలు శనివారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 తగ్గి.. రూ. 60,590కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 60,600గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 6,05,900కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 6,059గా కొనసాగుతోంది.
ఇక, హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,590గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 66,100గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి. కాగా దేశంలో వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,690గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 76,900గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 77,000గా ఉండేది. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 79,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 76,900.. బెంగళూరులో రూ. 76,100గా ఉంది.