Tuesday, November 26, 2024

HYD | ఆరోగ్యకరమైన మిరప పువ్వుల రైతులకు గోద్రెజ్ రాషిన్‌బాన్ భరోసా

హైద‌రాబాద్: మిరప మొక్కలో కీలకమైన ఆర్థిక భాగమైనందున, మిరప సాగులో పువ్వులు విజయానికి అత్యంత కీలకం. ఈ సందర్భంగా జిఏవిఎల్ , క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ -సీఈఓ ఎన్ కె రాజవేలు మాట్లాడుతూ… పూత సమయం అంటే రాషిన్‌బాన్ సమయం అని పేర్కొన్నారు. మిరప రైతులు తమ పంట ఎదుగుదల పరంగా సరైన సమయంలో సరైన పోషకాలను అందేలా చూసుకోవాల్సి ఉందన్నారు. అదే సమయంలో భూసారం కోల్పోకుండా (అబియోటిక్) చూసుకోవాలన్నారు. ఇది పంట దిగుబడిని ప్రభావితం చేయడమే కాకుండా వారి పొలాల సున్నితమైన పర్యావరణ సమతుల్యతను కూడా దెబ్బతీస్తుందన్నారు.

ఈ సమస్యలను రాషిన్‌బాన్ పరిష్కరిస్తుందన్నారు. పంట నాటిన 45-75 రోజుల వద్ద రాషిన్‌బాన్ ఉపయోగించినప్పుడు, సమర్థవంతమైన పరిష్కారాన్ని అందిస్తుందన్నారు. మిరప రైతు విజయాన్ని నిర్వచించేది పువ్వులు.. మీ మిరప పువ్వులను రాషిన్‌బాన్ తో రక్షించుకోవడం చాలా ముఖ్యమన్నారు. సమగ్రమైన రక్షణ అందిస్తుండటం వల్ల మిరప మొక్కలు పూత దశకు చేరుకున్నప్పుడు వినియోగానికి ఇది ప్రత్యేకంగా సిఫార్సు చేయబడిందన్నారు. ఇప్పటికే ఉన్న గ్రాసియా, హనాబీ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోతో పాటు, రాషిన్‌బాన్ ను కూడా జోడించడం ద్వారా మిరప పంట మొత్తం వాల్యూ చైన్ లో రక్షణ అందించగలుగుతున్నామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement