గూగుల్ ప్రముఖ ఇమెయిల్ సర్వీస్ Gmail షట్ డౌన్ అవుతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే, పుకార్లను నమ్మవద్దని Gmail సేవలు కొనసాగుతాయని గూగుల్ ధృవీకరించింది. ఇటీవల, Gmail ఇక పని చేయదని ఒక ఫోటో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. దీంతో వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ సమాచారం నిజం కాదని గూగుల్ స్పష్టం చేసింది. Gmail సాధారణంగా పని చేస్తుందని కంపెనీ ప్రకటించింది.
కానీ, Gmail లో త్వరలో కొన్ని మార్పులు రానున్నాయని తెలుస్తోంది. Gmail ప్రాథమిక HTML వెర్షన్‌ను నిలిపివేయాలని Google నిర్ణయించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో గూగుల్ ఈ విషయాన్ని ధృవీకరించింది. వినియోగదారులు వారి ఇమెయిల్‌లను ప్రాథమిక ఆకృతిలో యాక్సెస్ చేయడానికి అనుమతించే ఈ వర్షెన్ ఇప్పుడు అందుబాటులో ఉండదు.
అదేవిధంగా బల్క్ ఈమెయిల్ పంపే వారిపై గూగుల్ పరిమితులు విధించనుంది. ఫలితంగా స్పామ్ మెయిల్‌లపై నియంత్రణ ఉండనుంది.