హైదరాబాద్ : మనం తీసుకునే ఆహారం, మన చర్మం, మొత్తం ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతుంది. అందువల్ల, బాదం వంటి పోషకమైన ఆహారాలను చేర్చడం ద్వారా స్వచ్ఛమైన, సమతుల్య ఆహారాన్ని నిర్వహించడం చాలా ముఖ్యం. 15 ముఖ్యమైన పోషకాలను సమృద్ధిగా కలిగిన బాదం మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.
ఈసందర్భంగా స్కిన్ ఎక్స్‌పర్ట్ అండ్ కాస్మోటాలజిస్ట్ గీతికా మిట్టల్ గుప్తా మాట్లాడుతూ… ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారాన్ని ఎంచుకోవడం చాలా అవసరమన్నారు. బాదంపప్పులను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండన్నారు. బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ మాట్లాడుతూ… తాను ఎక్కడికి వెళ్లినా బాదం పప్పుల పెట్టెను తీసుకువెళ్తానన్నారు. బాదం, చర్మం, మొత్తం ఆరోగ్యం రెండింటినీ నేరుగా ప్రభావితం చేస్తుందన్నారు.
పోషకాహార నిపుణులు డాక్టర్ రోహిణి పాటిల్ మాట్లాడుతూ… యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు బాదంలో ఉంటాయన్నారు. ఢిల్లీలోని మాక్స్ హెల్త్‌కేర్‌లో డైటెటిక్స్ రీజినల్ హెడ్ రితికా సమద్దర్ మాట్లాడుతూ… బాదం వంటి పోషకాలు అధికంగా ఉండే గింజలు, విటమిన్ ఈ, ఆరోగ్యకరమైన కొవ్వులు, మంచి చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయన్నారు. ఫిట్‌నెస్ మాస్టర్ పిలేట్స్ ఇన్‌స్ట్రక్టర్ యాస్మిన్ కరాచీవాలా మాట్లాడుతూ… మీ రోజువారీ ఆహారంలో బాదం, సీజనల్ పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి సహజ ఆహారాలను చేర్చండన్నారు.
ఆయుర్వేద నిపుణురాలు మధుమిత కృష్ణన్ మాట్లాడుతూ… చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించే, చర్మ కాంతిని పెంచే సామర్థ్యం బాదంకు ఉందన్నారు. ప్రముఖ దక్షిణ భారత నటి ప్రణీత సుభాష్ మాట్లాడుతూ… సరైన చర్మం, మొత్తం ఆరోగ్యం కోసం నేను ఎల్లప్పుడూ నా ఆహారంలో బాదం వంటి గింజలను చేర్చుకుంటానన్నారు. దక్షిణ భారత నటి వాణీ భోజన్ మాట్లాడుతూ… బాదంపప్పులు తన ఆహారంలో ప్రధానమైనవన్నారు. ఎందుకంటే అవి యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇతో నిండి ఉంటాయన్నారు.