Thursday, November 28, 2024

లండన్ వాల్వ్స్ 2024 వద్ద మెరిసిన జీఐఎస్ఈ, పీసీఆర్

కార్డియోవాస్కులర్, స్ట్రక్చరల్ హార్ట్ సొల్యూషన్స్‌లో ప్రత్యేకత కలిగిన ప్రముఖ గ్లోబల్ మెడ్-టెక్ కంపెనీ, మెరిల్ లైఫ్ సైన్సెస్, GISE 2024 (నేషనల్ కాంగ్రెస్ అఫ్ ద ఇటాలియన్ సొసైటీ ఆఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ), పిసిఆర్ లండన్ వాల్వ్స్ 2024లో మైవల్ ఆక్టాప్రో ట్రాన్స్‌కాథెటర్ హార్ట్ వాల్వ్ (THV)ని విడుదల చేయటం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది.

డాక్టర్ జాన్ జోస్ – ప్రొఫెసర్ , కార్డియాలజీ హెడ్, యూనిట్ -2 (స్ట్రక్చరల్ అండ్ టిఎవిఐ ఇంటర్వెన్షన్స్) సిఎంసి, వెల్లూరు వారు మాట్లాడుతూ “ విప్లవాత్మక ఆక్టాప్రో ట్రాన్స్‌కాథెటర్ వాల్వ్ తయారీదారులు మైవల్ ట్రాన్స్‌కాథెటర్ వాల్వ్ సిరీస్ యొక్క అన్ని వారసత్వ లక్షణాలను నిలిపిఉంచారు. మైవల్ ఆక్టాప్రో THV విడుదల సందర్భంగా వారికి హృదయపూర్వక అభినందనలు! ఉన్నతమైన క్లినికల్ పనితీరు మరియు ప్రత్యేక లక్షణాలతో, ఈ సాంకేతికత ఆరోటిక్ స్టెనోసిస్ చికిత్సలో విప్లవాత్మక మార్పులకు హామీ ఇస్తుంది. కార్డియోవాస్కులర్ కేర్‌ను అభివృద్ధి చేయడంలో మెరిల్ యొక్క అంకితభావం నిజంగా అభినందనీయం..” అని అన్నారు.

ఈ విజయంపై మెరిల్ లైఫ్ సైన్సెస్‌లో కార్పొరేట్ స్ట్రాటజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ భట్ మాట్లాడుతూ : “ఈ గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌లలో మైవల్ ఆక్టాప్రో THV కు సానుకూల ఆదరణ లభించటం, తీవ్రమైన అరోటిక్ స్టెనోసిస్‌కు అత్యాధునిక పరిష్కారాలను అందించడంలో మా నిబద్ధతను నొక్కి చెబుతుంది. TAVR సాంకేతికతను అభివృద్ధి చేయడంలో మరియు ఆవిష్కరణల ద్వారా రోగి ఫలితాలను మెరుగుపరచడంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులతో భాగస్వామ్యం చేసుకోవటం గర్వంగా ఉంది ” అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement