హైదరాబాద్, ప్రభన్యూస్ ప్రతినిధి: జెనెరా ఫార్మా బైఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన ఫిజర్ కొవిడ్ డ్రగ్‌కు అనుమతి లభించిందని సంస్థ తెలిపింది. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీవో) తయారీ అమ్మకానికి అనుమతించిందని పేర్కొంది. 2021లో అమెరికా ఎఫ్‌డీఐ ఈ ఔషధానికి అనుమతులు ఇచ్చిందని గుర్తు చేశారు. కొవిడ్ డ్రగ్ ఖర్చుతో కూడుకున్న నేపథ్యంలో తమ సంస్థ జెనరిక్ తయారుచేసి సామాన్యులకు అందుబాటులోకి తెచ్చిందని సంస్థ ఎండీ జగదీష్‌బాబు రంగిశెట్టి వివరించారు.
కొవిడ్ పేషెంట్లకు ట్యాబ్‌లెట్ల రూపంలో ఫిక్సాజెన్ పేరుతో మార్కెట్లో అందుబాటులోకి తేనున్నట్టు పేర్కొన్నారు. సంస్థ సీఈవో డాక్టర్ శ్రీనివాస్ ఆరుట్ల మాట్లాడుతూ, రాబోయే రెండు వారాల్లో దీనిని ఇండియాలో ప్రారంభించనున్నట్టు వివరించారు. దేశంలోని ప్రధాన ఆస్పత్రులు, ఇతర సంస్థలతో చర్చించి త్వరగా ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.