శాంసంగ్ గెలాక్సీ-ఎస్24కు అత్యవసర సేవల ఫీచర్‌కోసం శాటిలైట్ కనెక్టివిటీని పరిచయం చేయనున్నట్లు దక్షిణ కొరియాకు చెందిన మొబైల్ సంస్థ ప్రకటించింది. వచ్చే ఏడాది ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని శాంసంగ్ ఎల్‌ఎస్‌ఐ డివిజన్ సీఈవో పార్క్ యోంగ్ తెలిపారు. స్మార్ట్‌ఫోన్ల కోసం టూ-వే శాటిలైట్ కనెక్టివిటీ ఎనేబుల్ చేసే సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు శాంసంగ్ కొన్ని నెలల కిందటే వెల్లడించింది. గెలాక్సీ ఎస్ 24 సిరీస్‌లో ఈ సాంకేతికతను జొప్పించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ఫీచర్ మొదటిసారి 2022లో యాపిల్ ఐఫోన్ 14 సిరీస్‌లో కనిపించింది. ఇది చాలామంది వినియోగదారులను ప్రమాదకర పరిస్థితుల్నుంచి రక్షించడానికి సహాయపడింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement