రిలయన్స్, ఫ్యూచర్ రిటైల్ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందానికి మళ్లీ బ్రేకులు పడ్డాయి. రూ.24,713 కోట్ల ఈ ఒప్పందాన్ని నిలిపివేయాలన్న సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఉత్తర్వును ఢిల్లీ హైకోర్టు సమర్ధించింది. రిలయన్స్‌తో కుదిరిన ఒప్పందం విషయంలో తదుపరి చర్య చేపట్టరాదని ఫ్యూచర్ రిటైల్‌ను ఆదేశించింది. కిశోర్ బియానీ తదితరులు ఏప్రిల్ 28న ఢిల్లీ హైకోర్టుకు హాజరు కావాలని, వారి ఆస్తులను జప్తు చేయాలని జస్టిస్ జేఆర్ మిధా ఆదేశించారు. అంతేకాకుండా ఎస్‌ఐఏసీ ఆదేశాన్ని ఉల్లంఘించినందుకు మూడు నెలల పాటు జైలులో ఎందుకు నిర్బంధించకూడదో చెప్పాలని కోర్టు వారిని ప్రశ్నించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement