న్యూఢిల్లి: దేశవ్యాప్తంగా రిటైల్ ఇంధన ధరల భారం కొనసాగుతోంది. పెట్రోల్, డీజెల్ ధరలు బుధవారం మళ్లిd పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజెల్ రూ.0.35 చొప్పున పెరిగాయి. దీంతో దేశరాజధాని న్యూఢిల్లిdలో లీటర్ పెట్రోల్ జీవితకాల గరిష్ఠం రూ.106.19కి చేరింది. కాగా లీటర్ డీజెల్ రూ.94.92కి పెరిగింది. రెండు రోజులపాటు యథాతథంగా కొనసాగిన అనంతరం బుధవారం మళ్లిd పెరిగాయి. తాజా పెంపుతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు సరికొత్త గరిష్ఠానికి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధర ఏడేళ్ల గరిష్ఠం స్థాయిలో ట్రేడ్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా బుధవారం పెంపుతో దేశ ఆర్థిక రాజధాని న్యూఢిల్లిdలో లీటర్ పెట్రోల్ ధర రూ.112.11కి చేరింది. ఇక డీజెల్ రూ.102.89కి పెరిగింది. ఇక చెన్నైలో పెట్రోల్ రూ.10.3.31గా ఉంది. మెట్రో నగరాల్లో ముంబైలోనే పెట్రోల్, డీజెల్ దరలు అధికంగా ఉన్నాయి. అయితే రాష్ట్రాల పన్నుల ఆధారంగా ప్రాంతాలను బట్టి ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. విమాన ఇంధనం ఏటీఎఫ్ కంటే పెట్రోల్ ధరలు ప్రస్తుతం 33 శాతం అధికంగా ఉన్నాయి. ఏటీఎఫ్ కిలోలీటర్ రూ.79, 020.16 లేదా లీటర్ రూ.79గా ఉంది. కాగా రాజస్థాన్‌లోఇ గంగానగర్‌లో లీటర్ పెట్రోల్ గరిష్ఠంగా రూ.117.86గా ఉంది. అక్కడ రూ.105.95గా ఉంది. ధరలు పెరుగుతు న్న నేపథ్యంలో డిమాండ్‌కి ఇంధనాన్ని సప్లయ్ చేసేందుకు ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. అయితే సప్లయ్ పెరిగినా ఇప్పటికిప్పుడే ధరలు తగ్గుముఖం పట్టే అవకాశాలు లేవు.
Advertisement
తాజా వార్తలు
Advertisement