ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో కొత్త సర్వీస్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే విమాన టికెట్, హోటల్ బుకింగ్ సేవలను ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్… కస్టమర్ల సౌకర్యార్థం బస్ టికెట్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం ఫ్లిప్‌కార్ట్ సంస్థ రాష్ట్ర రవాణ కార్పొరేషన్లు, ప్రైవేట్ అగ్రిగేటర్లతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ప్రస్తుతానికి బెంగళూరు, ఛండీగఢ్, ఢిల్లీ, జైపూర్, ఇండోర్, అహ్మదాబాద్, హైదరాబాద్, ముంబై, చెన్నైలలో ఈ టికెట్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 25 వేలకు పైగా రూట్లలో 10 లక్షలకు పైగా ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అయితే.. ఎలాంటి చార్జీలు లేకుండా బస్ టికెట్‌ను బుకింగ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అలాగే ఈ నూతన సేవలు ప్రారంభ సందర్భంగా ఈ నెల 15 వరకు 20 శాతం వరకు రాయితీని కల్పించనుంది.