తైవాన్‌కు చెందిన హాన్ హై ప్రెసిషన్ ఇండస్ట్రీ కో కంపెనీ భారత్‌లో మరింత విస్తరించాలని నిర్ణయించింది. ఇందు కోసం 1.6 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. హన్ హై ప్రెసిషన్ ఇండస్ట్రీనే ఫాక్స్‌కాన్‌గా ప్రసిద్ధి చెందింది. ఇండియాలో కొత్త ప్లాంట్ల నిర్మాణం కోసం ఈ మొత్తాన్ని వ్యయం చేయనున్నట్లు తెలిపింది. అయితే ఈ ప్లాంట్లు ఎక్కడ వస్తుందని, ఇతర వివరాలను కంపెనీ వెల్లడించలేదు.
ఫాక్స్‌కాన్ చైనా వెలుపల ఐ ఫోన్ల తయారీని పెంచాలని ప్రయత్నిస్తోంది. ఇందుకు ప్రధానంగా ఇండియాలో ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచాలని నిర్ణయించింది. చైనా- అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మూలంగానే ఫాక్స్‌కాన్ ఈ నిర్ణయం తీసుకుంది. యాపిల్ ఐఫోన్ల తయారీ ద్వారానే ఫాక్స్‌కాన్‌కు 50 శాతం వరకు ఆదాయం సమకూరుతోంది.
ఫాక్స్‌కాన్ బెంగళూర్ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో 300 ఎకరాల్లో ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. దీనికి 700 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్ల గతంలోనే ఫాక్స్‌కాన్ ప్రకటించింది. ఫాక్స్‌కాన్‌కు ఇప్పటికే ఇండియాలో 9 ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో వేల సంఖ్యలో ఉద్యోగులు పని చేస్తున్నారు. ఫాక్స్‌కాన్ ఈ సంవత్సరం ఐఫోన్ 15ను ఇండియాలోనే తయారు చేసింది.