Friday, November 22, 2024

వేదాంత డీల్‌ నుంచి ఫాక్స్‌కాన్‌ నిష్క్రమణ?

భారతదేశంలో చిప్‌లను తయారు చేయాలనే మోడీ ప్రభుత్వ ప్రణాళికలకు ఎదురుదెబ్బ తగిలింది. తైవాన్‌కు చెందిన కాంట్రాక్ట్‌ తయారీదారు ఫాక్స్‌కాన్‌ సంస్థ వేదాంతతో తలపెట్టిన జాయింట్‌ వెంచర్‌ నుండి వైదొలిగినట్లు నివేదించబడింది. జాయింట్‌ వెంచర్‌ ద్వారా గుజరాత్‌లో 19.5 బిలియన్‌ డాలర్ల అంచనా వ్యయంతో చిప్‌ తయారీ, డిస్‌ప్లే ఫ్యాబ్‌ను నిర్మించాలని భావించారు. జాయింట్‌ వెంచర్‌లో వేదాంత 63 శాతం వాటాను కలిగి ఉంది, మిగతా వాటాను తైవాన్‌కు చెందిన హాన్‌ #హ ప్రెసిషన్‌ ఇండస్ట్రీ కో. లిమిటెడ్‌ (ఫాక్స్‌కాన్‌) కలిగివుంది. గత వారమే, వేదాంత గ్రూప్‌, ఫాక్స్‌కాన్‌ మధ్య జాయింట్‌ వెంచర్‌ అయిన వేదాంత ఫాక్స్‌కాన్‌ సెమీకండక్టర్‌ లిమిటెడ్‌ (విఎఫ్‌ఎస్‌ఎల్‌) యాజమాన్య నిర్మాణంలో మార్పు వచ్చింది.

వేదాంత యొక్క అల్టిమేట్‌ #హూల్డింగ్‌ కంపెనీకి అనుబంధంగా ఉన్న ట్విన్‌ స్టార్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ వాటాను వేదాంత లిమిటెడ్‌ తీసుకుంది. మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) లిస్టింగ్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు దీనిపై రూ. 30 లక్షల జరిమానా విధించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. గతేడాది విఎఫ్‌ఎస్‌ఎల్‌ భారత్‌లో చిప్‌ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి 10 బిలియన్‌ డాలర్ల మేరకు రాయితీ పొందే సంస్థలలో ఒకటిగా నిలిచింది. అయితే, ఫాక్స్‌కాన్‌ జాయింట్‌ వెంచర్‌ నుంచి వైదొలగిన నేపథ్యంలో, సెమీకండక్టర్‌ ఫ్యాబ్‌ ఆకాంక్షలను వేదాంత ఏమేరకు ముందుకు తీసుకెళ్లగలదనే ప్రశ్న రేకెత్తుతోంది

Advertisement

తాజా వార్తలు

Advertisement