హైదరాబాద్, (ప్రభ న్యూస్) : భారతదేశం మెచ్చే లాస్ ఎంజిలస్‌కు చెందిన అంతర్జాతీయ ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్ ఫరెవర్ 21. ఇండియా, దేశాల్లో దీని లైసెన్స్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ తీసుకుంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్ అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఫరెవర్ 21 బిజినెస్ హెడ్ (ఇండియా) ముఖేష్ సోనీ మాట్లాడుతూ… హైదరాబాద్‌లోని తమ సరికొత్త ఫరెవర్ 21 ఫ్లాగ్‌షిప్ స్టోర్ ప్రారంభించినందుకు తాము సంతోషిస్తున్నామన్నారు. వీకెండ్ సందర్భంగా విశేష ఆదరణ పొందుతోందన్నారు. యువ ఫ్యాషన్ ప్రియులకు సరికొత్త ఫ్యాషన్ దుస్తులు, క్యాట్ వాక్ ట్రెండ్స్‌ను అత్యంత ఆకర్షణీయమైన ధరల్లో ఫరెవర్ 21 అందిస్తుందన్నారు
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..