విదేశీ మారక నిల్వలు అక్టోబర్ 21 నాటికి 3.8 బిలయిన్ డాలర్లు తగ్గి 524.52 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ప్రస్తుత నిల్వలు 2020 జులై 24 స్థాయికి పడిపోయాయి. ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ విదేవీ కర్సెన్సీ ఎసెట్స్ 3.6 బిలియన్ తగ్గి 465.08 బిలియన్ డాలర్లకు పడిపోవడంతో ఈ తగ్గుదల నమోదైంది. ఆర్బీఐ విడుదల చేసిన వారంతపు నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. ప్రధానంగా ఇంత భారీగా నిల్వలు తగ్గిపోవడానికి గత వారం రిజర్వ్ బ్యాంక్ డాలర్‌తో రూపాయి మారకపు విలువ భారీగా పతనం కాకుండా నిరోధించేందుకు డాలర్లను ఖర్చు చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ వారం డాలర్‌తో మన రూపాయి మారకపు విలువ 83.29 రూపాయలకు పడిపోయింది.
2022లో ఇప్పటి వరకు డాలర్‌తో మన రూపాయి విలువ 9.9 శాతం తగ్గింది. రష్యా ఉక్రెయిన్‌పై దాడికి పాల్పడిన తరువాత ఫిబ్రవరి 25 నాటికి మన విదేశీ మారక నిల్వలు 631.53 బిలియన్ డాలర్లు ఉన్నాయి. డాలర్ బలోపతం కావడ ంతో విదేశీ మారక నిల్వలు 67 శాతం తగ్గాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఆగస్టులో ఆర్బీఐ 4.2 బిలియన్ డాలర్లను ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్‌లో విక్రయించింది. జులైలో 18 బిలియన్ డాలర్లను విక్రయించింది.