Friday, November 22, 2024

Follow Up: స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..

స్టాక్‌ మార్కెట్లు సోమవారం నాడు ప్లాట్‌గా ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లకు మధ్యాహ్నం కొనుగోళ్ల మద్దతు లభించడంతో కోలుకున్నాయి. చివరకు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఆసియా పసిఫిక్‌ మార్కెట్లు , ఐరోపా, అమెరికా మార్కెట్లు కూడా నష్టాల్లో ముగియడంతో ఆ ప్రభావం మన మార్కెట్లపై పడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత పతనమైంది. సెన్సెక్స్‌ 86.61 పాయింట్ల నష్టంతో 54395.23 వద్ద ముగిసింది. నిఫ్టీ 4.60 పాయింట్ల నష్టంతో 16216వద్ద ముగిసింది.

బంగారం 10 గ్రాముల ధర 135 రూపాయలు తగ్గి 50644 గా ఉంది. వెండి కిలో 141 రూపాయలు తగ్గి 56990 వద్ద ట్రేడ్‌ అయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 78.97 రూపాయలుగా ఉంది. లాభపడిన షేర్లు టాటా స్టీల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఏషియన్‌ పేయింట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఉన్నాయి. నష్టపోయిన షేర్లు భారతీ ఎయిర్‌ టెల్‌, టీసీఎస్‌, హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో షేర్లు ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement