ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ కి భారీ జరిమాన విధించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. విదేశీ పెట్టుబడుల చట్టంలోని నిబంధనల్ని ఉల్లంఘించినందుకు గాను ఈడీ..ఫ్లిప్ కార్ట్‌కు 100 బిలియన్ డాలర్ల ఫైన్ విధించింది. దీనికి సంబంధించిన నోటీసులను ఫ్లిప్‌కార్ట్ సంస్థకు, దాన్ని ఫౌండర్లకు ఈడీ పంపించింది. 100 బిలియన్ డాలర్ల ఫైన్‌ను మీరు ఎందుకు కట్టకూడదో వివరణ ఇచ్చుకోండి.. అంటూ ఈడీ నోటీసులో పేర్కొన్నది. గత కొన్నేళ్ల నుంచి ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మరో ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కూడా ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ చట్టాలను ఉల్లంఘిస్తున్నట్టు ఈడీ విచారణలో తేలింది. ఫారెన్ ఇన్వెస్టర్ డబ్ల్యూఎస్ రిటైల్ ద్వారా కస్టమర్లకు ఆ షాపింగ్ వెబ్ సైట్‌లో వస్తువులు అమ్మిందని.. ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ లా ప్రకారం అది నిషేధం అని ఈడీకి చెందిన ఓ అధికారి తెలిపారు.
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బెంగళూరు కేంద్రంగా ఫ్లిప్ కార్ట్‌కు పేటెంట్ కంపెనీగా ఉన్న డబ్ల్యూఎస్ రీటైల్ సర్వీస్‌లో విదేశీ ఇన్వెస్టర‍్లు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించి.. ఆ పెట్టుబడులతో ఫ్లిప్‌కార్ట్ తన ఈకామర్స్ ప్లాట్ ఫామ్ లో వివిధ రకాల ఉత్పత్తులపై అమ్మకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఆ పెట్టుబడుల గురించి వెలుగులోకి రావడంతో ఈడీ విచారణ చేపట్టి.. గత నెల చెన్నైలోని ఫ్లిప్ కార్ట్ కార్యాలయానికి సచిన్ బన్సాల్, బిన్నీ బన‍్సాల్ పేరుమీద షోకాజు నోటీసులు జారీ చేసింది. ఇక ఇదే విషయంపై బిన్నీ బన్సాల్, సచిన్ బన్సాల్‌లు స్పందించకపోవడం ఈడీ నోటీసులకు ఊతం ఇచ్చేలా ఉంది.
ఇది కూడా చదవండి: తీన్మార్ మల్లన్న అరెస్ట్ కు రంగం సిద్ధం?