Friday, November 22, 2024

హెల్త్‌ ప్లస్‌ యాప్‌తో ఆరోగ్య సేవల్లోకి ప్రవేశించిన ప్లిప్‌కార్ట్‌..

హైదరాబాద్‌, ప్రభన్యూస్ : భారతదేశంలో స్థానికంగా వృద్ధి చెందిన ప్లిప్‌కార్ట్‌ గ్రూపు డిజిటల్‌ ఆరోగ్య సేవల మార్కెట్‌ప్లేస్‌ ప్లాట్‌ఫారంపై ప్లిప్‌కార్ట్‌ హెల్త్‌ ప్లస్‌ యాప్‌ను విడుదల చేసింది. ఇది దేశ వ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులకు అధీకృత ఔషధాలు అలాగే ఆరోగ్య సేవల ఉత్పత్తులు, సేవలను అందిస్తుంది. ప్లిప్‌కార్ట్‌ హెల్త్‌ ప్లస్‌ యాప్‌ విడుదల గురించి ప్లిప్‌కార్ట్‌ హెల్త్‌ ప్లస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ప్రశాంత్‌ ఝవేరి మాట్లాడుతూ…

కొవిడ్‌-19 మహమ్మారి ప్రారంభమైన రోజు నుంచి భారతీయులు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. అలాగే రోగ నిరోధక ఆరోగ్య సేవల్లో అపారమైన మార్పును కనుగొన్నారన్నారు. అదేవిధంగా ఆరోగ్య సేవలు స్వస్థతకు గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రాధాన్యత పెరిగిందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement